సురేందర్‌రెడ్డి శిష్యుడు శ్రీనివాసరెడ్డికి ఓ ఛాన్స్ ఇచ్చాడు రామ్. వీరిద్దరి కలయికలో ఓ చిత్రం మొదలైంది. ఇటీవలే కొబ్బరికాయ్ కొట్టుకొన్న ఈ సినిమా.. ప్రస్తుతం చకచక షూటింగ్ జరుపుకొంటోంది. అయితే ఈ స్ర్కిప్టు నితిన్ కోసం తయారు చేసుకొందట. ముందు నితిన్‌కే వినిపించాడు శ్రీనివాసరెడ్డి. నితిన్ కూడా ఓకే అన్నాడు. లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది కూడా. కానీ అంతలోనే ఆగిపోయింది.
నితిన్ కాంపౌండ్‌లో రచయిత హర్షవర్థన్ కాస్త యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇష్క్, గుండెజారిగల్లంతయ్యిందే సినిమాలకు మాటలు అందించాడు హర్ష. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్టయి.. నితిన్ ట్రాక్ ఎక్కేశాడు. దాంతో హర్షపై నితిన్‌కి నమ్మకం పెరిగింది. దాంతో చనవూ ఏర్పడింది. దాంతో నితిన్ కథలో హర్ష జోక్యం పెరగడం ప్రారంభమైంది.
ఈ జోక్యం మరీ మితిమీరడంతో శ్రీనివాసరెడ్డి తన స్ర్కిప్టు పట్టుకొని బయటకు వచ్చేశాడు. ఆ తరవాత స్రవంతి మూవీస్ కాంపౌండ్లో చేరాడు. శ్రీనివాసరెడ్డి కథపై గురి గుదిరి.. రామ్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఇప్పుడు షూటింగ్ కూడా జరిగిపోతోంది. దానే దానే పర్ ఖానేవాలాకా నామ్ అన్నట్టు కథ కథపైనా హీరో పేరు రాసుంటుందంటే ఇదేనేమో.!