ఆ బ్యానర్ కు డిస్కౌంట్ ఇచ్చిన నితిన్

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై “లై” అనే సినిమా చేశాడు నితిన్. ఈ హీరో కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన లై.. డిజాస్టర్ అయింది. ఆ బ్యానర్…

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై “లై” అనే సినిమా చేశాడు నితిన్. ఈ హీరో కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన లై.. డిజాస్టర్ అయింది. ఆ బ్యానర్ కు భారీ నష్టాలు మిగిల్చింది. చాలా ఏరియాల్లో సొంత రిలీజ్ కు వెళ్లి ఘోరంగా దెబ్బతిన్న 14రీల్స్ ను ఆదుకునేందుకు నితిన్ ముందుకొచ్చాడు. ఆ బ్యానర్ లో మరో సినిమా చేసిపెడతానని నిర్మాతలకు మాటిచ్చాడు. అది కూడా డిస్కౌంట్ ధరకే.

ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో 14-రీల్స్ బ్యానర్ చర్చలు జరుపుతోంది. స్టోరీలైన్ ఓకే అయింది. మిగతా వ్యవహారాలు సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ కొత్త కుర్రాడి దర్శకత్వంలోనే నితిన్ హీరోగా సినిమా ఉండబోతోంది.

ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూవీ అప్ డేట్స్ ఏవీ ఇంతవరకు బయటకు రాలేదు. త్వరలోనే దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కల్యాణం అనే సినిమాలో కూడా నటించబోతున్నాడు. మరి 14 రీల్స్ కు ఎప్పట్నుంచి కాల్షీట్లు ఇస్తాడో చూడాలి.