గ్రహబలం లేదు.. బాలయ్య తప్పుకుంటాడట!

ముహూర్తాలు, జాతకాలు అన్నీ చూసిమరీ పెట్టాడు NBK ఫిలిమ్స్ అనే బ్యానర్ ను. తొలి ప్రయత్నంగా ఏకంగా తన తండ్రి బయోపిక్ నే తీశాడు. కానీ ముహూర్త బలం కుదరలేదు. గ్రహాలు అనుకూలించలేదు. దైవానుగ్రహం…

ముహూర్తాలు, జాతకాలు అన్నీ చూసిమరీ పెట్టాడు NBK ఫిలిమ్స్ అనే బ్యానర్ ను. తొలి ప్రయత్నంగా ఏకంగా తన తండ్రి బయోపిక్ నే తీశాడు. కానీ ముహూర్త బలం కుదరలేదు. గ్రహాలు అనుకూలించలేదు. దైవానుగ్రహం కలగలేదు. మెడలో వేసుకున్న గొలుసులు, చేతికి కట్టుకున్న తాళ్లు సత్ఫలితాలు ఇవ్వలేదు. ఫలితంగా రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయింది. ఈ దెబ్బకు నిర్మాణం రంగం నుంచి పూర్తిగా తప్పుకునే ఆలోచనకు వచ్చేశాడు బాలకృష్ణ.

బాలయ్య అంతే.. ఒకసారి కలిసిరాకపోతే ఇక ఆ జోలికి వెళ్లడు. గతంలో తన దర్శకత్వంలో నర్తనశాల ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. సౌందర్య అకాల మరణంతో పాటు మరికొన్ని విఘ్నాలు ఎదురుకావడంతో పూర్తిగా దర్శకత్వాన్నే వదిలేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అవ్వడంతో పూర్తిగా నిర్మాణాన్ని వదిలేయాలని అనుకుంటున్నాడట.

సక్సెస్ లేకపోతే లేదు, కనీసం లాభం వచ్చినా నిర్మాతగా కొనసాగేవాడేమో. తండ్రిగారి బయోపిక్ బాలయ్యకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. మొదటి భాగాన్ని మంచి రేటుకే అమ్మినప్పటికీ, అది మాంఛి ఫ్లాప్ అవ్వడంతో రెండో భాగాన్ని వాటాల పద్ధతిలో ఇవ్వాల్సి వచ్చింది. అదేమో పూర్తిగా డిజాస్టర్. 20శాతం కూడా వెనక్కి రాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ బాలయ్యకు కాస్త మిగిలిందట. కానీ బయ్యర్లు ఎక్కడ ధర్నాలు చేస్తారో అనే భయంలో ఉన్నాడట లెజెండ్.

శకునాలన్నీ ఇలా తనపై రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేయడంతో ఎందుకొచ్చిన నిర్మాణం అనే ధోరణిలో మాట్లాడుతున్నాడట బాలయ్య. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పై తొలి, చివరి చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే అంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు బాలయ్యకు నిర్మాతల కష్టాలు తెలిసొచ్చాయన్నమాట. 

షాలిని పాండేని 'అలంకారం'గా మాత్రమే వాడుకున్నారా?

కళ్యాణ్ రామ్ చెప్పినట్లే సినిమా ఉందా?