Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అతనితో నాని సినిమా ఉత్తిదేనట

అతనితో నాని సినిమా ఉత్తిదేనట

రాహుల్ రవీంద్రన్ నటన మానేసి దర్శకుడిగా స్థిరపడ్డాడు. మొదటి సినిమా ‘చి.ల.సౌ’తో కథా రచయితగా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే రెండవ చిత్రం ‘మన్మథుడు 2’ డిజాస్టర్ అవడంతో కొంతకాలం డిప్రెషన్‌కి లోనయ్యాడు. ఆ సినిమా ఫెయిలయినా నాగార్జున ఏమీ అనలేదని, సినిమా బాగానే వున్నా కానీ ఒక్కోసారి ప్రేక్షకులు ఆదరించరని, అంచేత ధైర్యం కోల్పోనక్కర్లేదని చెప్పారని చెప్పాడు.

ఒక ప్రముఖ తమిళ హీరో కోసం కథ రాస్తున్నానని, అన్నీ వర్కవుట్ అయితే తన తదుపరి చిత్రం అదే అవుతుందని రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్య్యూలో చెప్పాడు. అది కాకుండా ఒక చిన్న సినిమా కోసం కూడా కథ రాసుకుంటున్నాడట. కొంత కాలంగా రాహుల్ మలి చిత్రం నానితో వుంటుందని మీడియాలో ప్రచారమవుతోంది. ఆ సినిమా అయితే లేదని రాహుల్ క్లియర్ చేసేసాడు.

ఇక తన భార్య, సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సోషల్ మీడియాలో తరచుగా ట్రెండ్ అవుతుంటుంది. మీటూ ఉద్యమానికి చిన్మయి తనవంతుగా గట్టిగానే కృషి చేసి పెద్ద పెద్ద వాళ్ల తప్పులని ఎత్తి చూపించింది. ఆమె చేసేదాని వల్ల తనేకమీ ఇబ్బంది లేదని, తను మంచి చేస్తోంది కనుక భర్తగా తనవంతు సహకారం అందిస్తుంటానని రాహుల్ చెప్పాడు.

పంజాబ్ పోలీసులు ఏంచేసారో చూస్తే షాక్ అవుతారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?