ఇది సాక్ష్యం సినిమా మేటర్. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్. ఆమె హాట్ హాట్ అందాల కోసం ఈ సినిమా చూస్తే మాత్రం ఆశాభంగం తప్పదట. అవును… సాక్ష్యం సినిమాలో అచ్చమైన బ్రాహ్మణ పిల్లగా కనిపించనుందట పూజా.
డీజే సినిమాలో బన్నీ బ్రాహ్మణుడిగా కనిపిస్తే, పూజా హెగ్డే అల్ట్రా మోడ్రన్ లుక్ లో అదరగొట్టింది. ఒక సీన్ లో బికినీ కూడా మెరిసి పిచ్చెక్కించింది. కానీ సాక్ష్యంలో మాత్రం సీన్ రివర్స్ అంటున్నారు. పూజా హెగ్డే పక్కా సంప్రదాయబద్ధంగా కనిపిస్తుందట. అంతో ఇంతో గ్లామర్ షో ఉంటే అది పాటల్లోనే అంటున్నారు.
క్యారెక్టర్ కొత్తగా ఉందని సాక్ష్యం సినిమా సైన్ చేసిందట పూజా హెగ్డే. పైగా రెమ్యూనరేషన్ కూడా అడిగినంత ఇవ్వడంతో ఒప్పుకుందట. అంతే తప్ప, ఆమె కెరీర్ కు ఇది ఏమాత్రం పనికొచ్చే సినిమా కాదంటున్నారు సినీజనాలు.
అటు పూజా హెగ్డే కూడా ఈ సినిమా గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. తను త్వరలోనే చేయబోతున్న మహేష్ బాబు మూవీ గురించే ప్రతిచోటా మాట్లాడుతోంది.