నార్త్ లో కూడా స్పైడర్ తెలుగు వెర్షనే

స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర్షన్ మాత్రం తయారు చేయడం లేదు. Advertisement తమిళ, తెలుగు…

స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర్షన్ మాత్రం తయారు చేయడం లేదు.

తమిళ, తెలుగు వెర్షన్ లే నార్త్ ఇండియా, అందర్ దాన్ సౌత్ ఇండియా స్టేట్స్ లో కూడా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాహుబలి సినిమాను నార్త్ లో మార్కెట్ చేసిన టీమ్ నే స్పైడర్ వ్యవహారాలు కూడా చూడబోతోంది.

స్పైడర్ హిందీ వెర్షన్ హక్కులు డైరక్టర్ మురుగదాస్ దగ్గర వున్నాయి. ఆయన మదిలో మరి ఏముందో కానీ, సినిమా హిందీ వెర్షన్ అయితే విడుదల చేయడం లేదు. గతంలో తుపాకీ సినిమాను హిందీలో నేరుగా నిర్మించారు.

స్పైడర్ విషయంలో కూడా మురుగదాస్ కు అలాంటి ఆలోచన వున్నట్లుంది. హిందీ వెర్షన్ కాకపోయినా, తెలుగువెర్షన్ కు ముంబాయి, పూనె, ఢిల్లీ, కలకత్తా లాంటి పెద్ద నగరాల మల్టీ ఫ్లెక్స్ ల్లో మంచి మార్కెట్ నే వుంది. సుమారు రెండు కోట్ల మేరకు బిజినెస్ జరుగుతుందని అంచనా.

అందువల్ల తమిళ, తెలుగు కాపీలనే నార్త్ రాష్ట్రాల్లో కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.