ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో టాప్ డైరక్టర్ రాజమౌళి రూపొందించే సినిమా షూట్ ప్రారంభం కావడానికి డేట్ ఫిక్స్ అయింది. ముహుర్తం గతంలోనే అయిపోయింది. ఇక డైరక్ట్ గా రెగ్యులర్ షూట్ కు వెళ్లిపోవడమే. నవంబర్ 18 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 18 వరకు ఎన్టీఆర్ కంటిన్యూగా నెలరోజులు షూట్ లో వుంటారు. రామ్ చరణ్ కూడా తన 'వినయ విధేయ రామ' సినిమా పక్కన పెట్టి నవంబర్ 18 నుంచి పదిరోజులు ఈ సినిమా సెట్ మీదకు వస్తారు.
రెండు వందల కాల్ షీట్లు
ఆర్ఆర్ఆర్ కు ఎన్టీఆర్ టోటల్ గా రెండు వందలరోజులు కాల్ షీట్లు ఇచ్చినట్లు బోగట్టా. మరి బహుశా రామ్ చరణ్ కూడా అన్నే రోజులు ఇచ్చి వుండొచ్చు. రెండు వందల షూటింగ్ డేస్ హీరోనే ఇస్తే, టోటల్ గా మధ్యలో గ్యాప్ లు, పోస్ట్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఏర్పాట్లు అన్నీ కలిపి కనీసం మరో 200 రోజలు వుంటాయేమో? టోటల్ గా రాజమౌళి ఈ సినిమాను ఓ ఏడాదికి కాస్త అటు ఇటుగా తీసి పక్కన పెట్టే అవకాశం వుంది.
కానీ ఈ సినిమాకు కూడా గ్రాఫిక్స్ వర్క్ కాస్త ఎక్కువే కాబట్టి. విడుదలకు ఎప్పుడు రెడీ అవుతుందన్నది ఇప్పుడే జవాబు రాని ప్రశ్న.
వందకోట్ల ఆఫర్ ఓ జోక్
డివివి దానయ్య ఈ సినిమాను వదిలేస్తే, వందకోట్లు స్ట్రయిట్ గా ముందే ఇచ్చేస్తామని బాహుబలి నిర్మాతలు ఆఫర్ ఇచ్చినట్లు ఓ గ్యాసిప్ బయటకు వచ్చింది. ఇది పక్కా ఫాల్స్ అని ఇటు బాహుబలి వర్గాలు, అటు నిర్మాత దానయ్య వర్గాలు పేర్కొనడం విశేషం. అసలు ఆ వైనమే తమకు తెలియదని బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ కామెంట్ చేసినట్లు తెలిసింది. మరి ఖండించమంటారా? అని యూనిట్ వర్గాలు అడగ్గా, గ్యాసిప్ లు వస్తూనే వుంటాయి. ఖండించుకుంటూ పోతుంటే అదే పని అవుతుంది అని చెప్పినట్లు తెలుస్తోంది.
నిర్మాత దానయ్య వర్గాలు కూడా దీన్నిఓ జోక్ అని తీసేయడం విశేషం. వందకోట్లు అంటే చిన్న మొత్తమా? బాహుబలి నిర్మాతలు ఏమయినా పిచ్చోళ్లా? అలా ఇచ్చేయడానికి అని నిర్మాత దానయ్య తన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటివి అన్నీ సినిమా నిర్మాణం జరిగినంత కాలం వస్తూనే వుంటాయని, లైట్ తీస్కోవడనే అని ఆయన అన్నట్లు తెలుస్తోంది.