Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ బయోపిక్ –భారీ రేట్లు

ఎన్టీఆర్ బయోపిక్ –భారీ రేట్లు

ఇప్పటి వరకు బాలయ్య బాబుకు యాభైకోట్ల మార్కు సినిమా ఒక్కటే. గౌతమీపుత్ర శాతకర్ణి. వందకోట్ల సినిమా ఒక్కటీ లేదు. ఎన్టీఆర్ బయోపిక్ తో ఆ ముచ్చట తీరుతుందని భావిస్తున్నారు. సినిమా కలెక్షన్లు వందకోట్ల రేంజ్ వుంటాయా? వుండవా? అన్నది ఇప్పుడు తెలిసే సంగతికాదు. కానీ కనీసం సినిమా మార్కెటింగ్ అయినా వందకోట్లు దాటించాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు కావాల్సినంత బజ్ తీసుకువచ్చి, వందకోట్ల రేంజ్ ను  దాటి మార్కెట్ చేయాలని నిర్మాత బాలయ్య, తరపున నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న తోడల్లుడు ప్రసాద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి వందకోట్లకు పైగా మార్కెట్ అయిన సినిమాల ఖర్చు కూడా ఆ రేంజ్ లోనే డెభై కోట్లు, ఆ పైగా వుంటుంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కు ఖర్చు ఆ రేంజ్ లో వుండదని వినికిడి. జస్ట్ యాభై కోట్లతోనే సినిమాను ఫినిష్ చేసే ప్రయత్నంలో వున్నారని వినికిడి. అందులో కూడా డైరక్టర్ క్రిష్ రెమ్యూనిరేషన్, ఆపై విద్యాబాలన్ రెమ్యూనిరేషన్ నే కీలకం. మిగిలినవన్నీ పెద్ద పెద్ద నిడివి వున్న పాత్రలుకాదు.

ఇప్పటివరకు బయోపిక్ లో బాలయ్య పేరు తప్పిస్తే మరో పెద్ద పేరు లేదు. విద్యాబాలన్ మంచినటి, బాలీవుడ్ లో పేరున్న నటికావచ్చు కానీ, తెలుగునాట మార్కెటింగ్ కు పనికి వచ్చేంత అయితేకాదు. సినిమా జనాలు, పరిచయస్థులు ఇలాంటి వారందరితో అలనాటి సినిమా సెలబ్రిటీల పాత్రలు కానిచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బయటకు ఎవరికి వారు, తాను ఫలానాపాత్ర పోషిస్తున్నా అంటూ ప్రకటించిన పేర్లు ఏవీ సినిమాకు గ్లామర్ అద్దేవికావు.

శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ అన్న పేరు ఒకటి కాస్త ప్లస్. మరే పేర్లు ప్రస్తుతానికి పైకి వెల్లడించడం లేదు. చాలామంది వస్తారు? వుంటారు? అని ‘ట’ బొగట్టానే వినిపిస్తోంది తప్ప. అంతకు మించిలేదు. ఫ్యామిలీలు మొత్తం కదలివస్తే, అంత అద్భుతంగా వుందని పేరు వస్తే కూడా మహానటి సావిత్రి బయోపిక్ కు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 45కోట్లు దాటలేదు. శాటిలైట్ వంటి వాటితో కలుపుకుంటే 60కోట్లకు చేరుతుంది. పైగా అందులో దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్, నాగ్ చైతన్య, రాజేంద్ర ప్రసాద్, ఇలా తెలిసిన మొహాలు చాలా వున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ కు  ఫుల్ బజ్ రావాలంటే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ ఇలా చాలా పేర్లు యాడ్ అవ్వాలి. కేవలం ఎన్టీఆర్ జీవిత కథ, ఎన్టీఆర్ చరిష్మా, ఎన్టీఆర్ బయోపిక్ అనే పాయింట్ ల మీద వందకోట్ల సినిమా అవుతుందా? అన్నది అనుమానమే. ఎన్టీఆర్ బయోపిక్ కు ఓవర్ సీస్ రైట్స్ 12కోట్ల రేంజ్ లో చెబుతున్నారు.

మహానటికి పదిన్నర కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. గౌతమీపుత్ర శాతకర్ణి ఆరుకోట్ల లోపుగానే కలెక్షన్లు నమోదు చేసింది. మరి ఇప్పుడు బయోపిక్ కు 12కోట్ల రేటు అంటే, ఏ రేంజ్ లో హిట్ కావాలో, ఏ రేంజ్ లో ఆకట్టుకోవాలో అంచనా వేసుకోవాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?