Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ క్యాంప్ లో వక్కంతం వంశీ

ఎన్టీఆర్ క్యాంప్ లో వక్కంతం వంశీ

వక్కంతం వంశీ అనగానే సినిమా జనాలకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడు. అది కామన్. టెంపర్ లాంటి సినిమాతో మళ్లీ ఎన్టీఆర్ రీ స్టార్ట్ కావడానికి కారణం వక్కంతం వంశీనే. అలాగే వక్కంతం వంశీని డైరక్టర్ ను చేస్తానని మాట ఇచ్చింది, మళ్లీ పక్కన పెట్టిందీ ఎన్టీఆర్ నే. అలాంటి ఎన్టీఆర్ పై అలిగి దూరం వెళ్లాడు వక్కంతం వంశీ. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ కు దగ్గరయినట్లు తెలుస్తోంది. 

గతంలో ఎన్టీఆర్ ఓకె చేసిన కథ కాకుండా, మరో మంచి కథను ఎన్టీఆర్ కు వినిపించాడట వక్కంతం వంశీ. అయితే ఇంకా ఎన్టీఆర్ డెసిషన్ అయితే చెప్పలేదు. చందు మొండేటి, అనిల్ రావిపూడి కథలు కూడా విని అలా పెండింగ్ పెట్టిన ఎన్టీఆర్ వక్కంతం వంశీని కూడా మళ్లీ వెయిటింగ్ లిస్ట్ లోనే వుంచినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?