Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ సినిమా సంగతేమిటి?

ఎన్టీఆర్ సినిమా సంగతేమిటి?

ఇజమ్ సినిమా అడియో ఫంక్షన్ లో అనుకున్నారు..కానీ విడుదల కూడా అయిపోయింది..అయినా ఎన్టీఆర్ సినిమా ప్రకటన రానే లేదు. డైరక్టర్ వాంటెడ్ అన్నది నోటెడ్ కాజ్. పూరి కథ ఓకె కాలేదని ఆయన మాటల ద్వారానే తెలుస్తోంది. ఇక మిగిలిన ఏకైక చాయిస్ అనిల్ రావిపూడి మాత్రమే. 

ఆ సబ్జెక్ట్ మీద డవుట్. మరింకెలా? వివి వినాయక్, సురేందర్ రెడ్డి, శ్రీనువైట్ల, వీళ్లంతా జనవరికి ఖాళీ అవుతారు. మరి అంతవరకు ఓపిగ్గా వేచి వుండాల్సిందేనా? లేక, ఎవరో ఒకరితో డిసైడ్ అయిపోయి, ప్రకటన అన్నా ఇవ్వాలా? దొరికిన డైరక్టర్ ను దొరికినట్లు లాక్ చేసుకుంటున్నారు అంతా. బోయపాటి ఇలా మెగా క్యాంప్ లోకి వెళ్తే అలా అక్కడ ఫిక్స్ అయిపోయాడు.

కొరటాల శివ ఒక్క సినిమా చేసాడు..మహేష్ మళ్లీ లాగేసాడు. త్రివిక్రమ్ పవన్-మహేష్ మధ్యే తిరుగుతున్నాడు. కళ్యాణ్ కృష్ణ ఒక్క హిట్ ఇచ్చాడో లేదో నాగ్ అక్కడే వుంచేసాడు. ఇలా ఎక్కడిక్కడ డైరక్టర్లను లాక్ చేస్తుంటే, పాపం ఎన్టీఆర్ అటు ఇటు చూస్తూ ఖాళీగా వుండాల్సి వచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?