Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ గుస్సా

ఎన్టీఆర్ గుస్సా

గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చినా కూడా డైరక్టర్ బాబికి ఎన్టీఆర్ చాన్స్ ఇవ్వడానికి కారణం ఆ స్టోరీలోని కీలక పాయింట్. అదే చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు టైప్ లో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించడం. ఈ పాయింట్ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. మూడు డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే అవకాశం రావడం అన్నది స్టామినా వున్న నటుడిగా ఎన్టీఆర్ కు నచ్చింది. 

అందుకే ఆ కథకు చిన్న చిన్న చేంజెస్ సూచించి, ఓకె చేసాడు. అయితే ఈ పాయింట్ ను మాత్రం ఇప్పుడే రివీల్ చేయద్దని ముందే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అనుకున్నారు. కానీ ఎలా బయటకు వచ్చిందో ప్రింట్ మీడియాలోకి వచ్చేసింది. అది చూసి వెబ్ మీడియా ఫాలో..ఫాలో..ఫాలో అంది. సో..టోటల్ గా ఎన్టీఆర్ కూడా కమల్, మెగాస్టార్ ల మాదిరిగా మూడు పాత్రలు పోషించి చూపించాలని డిసైడ్ అయినట్లు జనాల్లోకి వెళ్లిపోయింది. 

ఇది ఎలా జరిగింది అని ఎన్టీఆర్ ఆరా తీసినట్లు వినికిడి. అయితే ప్రొడక్షన్ యూనిట్ వైపు నుంచి కాకుండా, డైరక్టర్ బాబీ, రైటర్ కోన వైపు నుంచి లీకయినట్లు తెలిసిందట. దాంతో ఎన్టీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సినిమా ఇంకా ఓపెన్ కాకుండానే కథలోని కీలకమైన పాయింట్ లీక్ కాకుండా చూడలేకపోయారు అని గుస్సాయించినట్లు తెలుస్తోంది. పైగా అనిరుధ్ ను మ్యూజిక్ డైరక్టర్ అని వార్తలు రావడం కూడా ఇబ్బందిగా మారుతుందేమో అనుకుంటున్నారట. 

అనిరుధ్ ను ఇంకా అనుకోలేదు..కాంట్రాక్ట్ చేయలేదు. కానీ ఒకవేళ దేవీశ్రీ కోసం వెళ్తే, అనిరుధ్ దొరక్క వచ్చారనుకుంటాడేమో...ఇలా మొత్తం మీద సినిమా విషయాలు లీక్ చేయకుండా చూడమని ఎన్టీఆర్ బాబీకి కబురు చేసినట్లు వినికిడి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?