ఎన్టీఆర్-హారిక దాగుడుమూతలు

హారిక హాసిని సంస్థ, హీరో ఎన్టీఆర్ మధ్య దాగుడు మూతలు పరాకాష్టకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. అలవైకుంఠపురములో సినిమా తరువాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ముందే ఫిక్స్ అయింది. Advertisement త్రివిక్రమ్ అజ్ఞాతవాసి లాంటి…

హారిక హాసిని సంస్థ, హీరో ఎన్టీఆర్ మధ్య దాగుడు మూతలు పరాకాష్టకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. అలవైకుంఠపురములో సినిమా తరువాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ముందే ఫిక్స్ అయింది.

త్రివిక్రమ్ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ ఇచ్చిన తరువాత ఎన్టీఆర్ లాంటి హీరో మాట తప్పకుండా సినిమా చేసాడు. అది ఆయన గొప్పతనం. ఇప్పుడు హీరో రావడం ఆలస్యం అవుతుందని చెప్పి, త్రివిక్రమ్ వెళ్లి మహేష్ తోనో, మరో హీరోతోనో సినిమా చేయడం అంటే ఏమనుకోవాలి అని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల ప్రశ్నిస్తున్నాయి. 

కానీ అదే సమయంలో త్రివిక్రమ్ వెళ్లిపోతే, కొరటాల శివ లేదా మరో డైరక్టర్ తో అర్జెంట్ గా ఎన్టీఆర్ సినిమా ప్రకటిస్తారని కూడా ఆ వర్గాలు ఫీలర్లు వదుల్తున్నాయి.

ఎన్టీఆర్ వేరే డైరక్టర్ ను చూసుకుంటారని ఫీలర్లు వస్తే, త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా చేస్తారనే ఫీలర్లు కూడా వాటికి సవాలుగా పుట్టుకువచ్చాయి. కానీ ఈ ఫీలర్లకు తమకు సంబంధం లేదు అని చెప్పడానికి కూడా హారిక వర్గాలు కిందా మీదా అవుతున్నాయి. ఎక్కడ ఎన్టీఆర్ తో సంబంధాలు చెడిపోతాయో అని హారిక హాసిని వర్గాలు భయపడుతున్నాయి.

మార్చికి వచ్చేస్తా

త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షెడ్యూలు వివరాలు అన్నీ వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మేరకు మార్చి నాటికి తాను ఫ్రీ అయిపోతాను అని ఇండైరెక్ట్ గా ఎన్టీఆర్ చెబుతున్నారు.

కానీ అలా అని మార్చి దాకా కాదు, కనీసం జనవరి వరకు వేచి వున్న తరువాత మరి కాస్త లేట్ అయితే తాము చేసేది ఏమీ వుండదని హారిక హాసిన వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ కోరిక

ఇటీవల రామ్ ప్రత్యేకంగా త్రివిక్రమ్ ను కలిసి ఖాళీ టైమ్ వుంటే కనుక తనతో ఓ సినిమా చేయమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, త్రివిక్రమ్ అల వైకుంఠపురములో బన్నీ తో చేసినా, రామ్ తో చేసినా, హీరో రెమ్యూనిరేషన్ మినహా బడ్జెట్ లో పెద్ద తేడా వుండదు.

ఆయన టీమ్ అయిన వినోద్, ప్రకాష్, థమన్, రామ్ లక్ష్మణ్ ఇలా అందరూ వుండాల్సిందే. నితిన్ తో సినిమా తీసినపుడు, హీరో రెమ్యూనిరేషన్ వదులుకుంటేనే ఆ సినిమాకు బడ్జెట్ నలభై దాటేసింది. అది కొన్నాళ్ల కిందట సంగతి. మరి ఇప్పుడు అయితే కచ్చితంగా 70 దాటేస్తుంది.  కానీ బన్నీ, ఎన్టీఆర్ లాంటి హీరోల మార్కెట్ రామ్ కు వుండదు కదా?

కథల్లేవు

నిజానికి త్రివిక్రమ్ దగ్గర మహేష్ కు కావచ్చు, రామ్ కు కావచ్చు రెడీగా కథలేవీ లేవు అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఎన్టీఆర్ సినిమా కథ, ఫైనల్ వెర్షన్ నే ఇంకా రెడీ కావాల్సి వుందని తెలుస్తోంది.

మరి ఇప్పటికిప్పుడు మహేష్ నో, రామ్ నో సినిమా అన్నా కూడా త్రివిక్రమ్ కనీసం మూడు నెలలు టైమ్ తీసుకోవాలి. అలాంటపుడు ఆ టైమ్ ఏదో ఎన్టీఆర్ కోసమే తీసుకుంటే బెటర్ కదా? అన్న వాదనలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

అయ్యప్పన్ వ్యవహారం

ఎలాగూ పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ఫిక్స్ అయింది. దీనికి క్రియేటివ్ ఇన్ పుట్స్ ఏ మేరకు ఇస్తారు అన్నది పక్కన పెడితే, పవన్ తో ఈ సినిమా వ్యవహారాలు అన్నీ డీల్ చేసేది త్రివిక్రమ్ నే. అందువల్ల ఆ పనులు, ఆ మీటింగ్ లు, క్వాలిటీ చెకింగ్ లు అన్నీ ఎలాగూ వుంటాయి. త్రివిక్రమ్ కు మార్చి వరకు ఆ పనులు సరిపోతాయి.

ఏదో అద్భుతం జరిగితే తప్ప త్రివిక్రమ్ తను ఎన్టీఆర్ సినిమా చేసేలోపు మరో సినిమా చేయకపోవచ్చు. అలా జరిగినపక్షంలో ఎన్టీఆర్ కచ్చితంగా హారిక హాసినికి దూరం అయ్యే ప్రమాదం పొంచి వుంది.

ఇప్పటికే మహేష్ ను దూరం చేసుకుని చాలా ఏళ్లు అయింది. అది ఇప్పటికి ప్యాచప్ అవుతోంది. ఇప్పుడు ఎన్టీఆర్ ను కూడా అలా దూరం చేసుకునే తప్పు హారిక హాసిని చేస్తుందని అనుకోవడానికి లేదు.

గ్రేట్ ఆంధ్రా వచ్చిందే అందుకని తెలుసు