బాబాయ్ బాలయ్యకు విషెష్ చెప్పారు అబ్బాయిలు కల్యాణ్ రామ్, తారక్ లు. బాబాయ్ వందో సినిమా విడుదల సందర్భంగా వీరు ట్విటర్ ద్వారా స్పందించారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో మైలు రాయి అవుతుందని కల్యాణ్ రామ్ ఆకాంక్షించాడు. ‘ల్యాండ్ మార్క్ ఫర్ ద లెజెండ్..’ అంటూ ఈ హీరో ట్వీట్ చేశాడు. సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక బాబాయ్ కి, ఈ సినిమా యూనిట్ కు దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆల్ ద బెస్ట్ చెప్పాడు ఎన్టీఆర్. ఈ హీరో ఈ మేరకు ట్వీట్ చేశాడు. మరి బాబాయ్ కి, అబ్బాయిలకు ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయన్న ఊహాగానాల నడుమ వీరు ట్వీట్లు చేయడం గమనార్హం.
అయితే వీరు ట్వీట్లతోనే సరిపెట్టారనే మాటా వినిపిస్తోంది. మెగా స్టార్ 150 వ సినిమా విడుదల సందర్భంగా ఆయన కుటుంబీకులు థియేటర్ల వద్ద వరకూ వచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. నందమూరి అబ్బాయిలు మాత్రం బాబాయ్ కి, ఆయన వందో సినిమా యూనిట్ కు శుభాకాంక్షల ట్వీట్లతో సరిపెట్టారు. ట్వీట్లది ఏముంది.. అందరూ పెట్టేవేగా!