ఎన్టీఆర్ కు హిట్ చిత్రాల బ్యానర్ హారిక హసినికి మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హ్యారిక హాసిని బ్యానర్ పై ఓ సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుని ఎన్టీఆర్ అడ్వాన్స్ అందుకున్నారని తెలుస్తోంది. ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాలని ఇటీవల ఎన్టీఆర్ చాలా గట్టిగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
మరి హారిక హాసిని సంస్థ ఎన్టీఆర్ కు అడ్వాన్స్ ఇచ్చింది అంటే, త్రివిక్రమ్ ఓ సినిమా ఎన్టీఆర్ తో చేయడానికి ఓకె అన్నారనే అనుకోవాలి. ఎన్టీఆర్ ఈ సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసుకున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ బోగట్టా.
మహేష్, పవన్, బన్నీ, ఎన్టీఆర్ మాత్రమే 15 కోట్ల నుంచి పాతిక కోట్ల మధ్య రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు. మహేష్ అందరినీ దాటి 25 కోట్ల దగ్గర వున్నారు. పవన్ ఆ తరువాత వున్నారు.