ఎన్టీఆర్ కు జడ్జిమెంట్ ప్రాబ్లమ్ అంట

ఒక సినిమా హిట్ అయినా హీరోలకు సమస్యే. తరువాత ఏం చేయాలి? అన్నది పెద్ద కశ్చను మార్క్ అయి కళ్ల ముందు కూర్చుంటుంది. స్టార్ ఎన్టీఆర్ సమస్య అదే. జనతా గ్యారేజ్ తరువాత ఏం…

ఒక సినిమా హిట్ అయినా హీరోలకు సమస్యే. తరువాత ఏం చేయాలి? అన్నది పెద్ద కశ్చను మార్క్ అయి కళ్ల ముందు కూర్చుంటుంది. స్టార్ ఎన్టీఆర్ సమస్య అదే. జనతా గ్యారేజ్ తరువాత ఏం చేయాలి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మూడు హిట్ లు వచ్చినట్లే అనుకోవాలి. దేని కలెక్షన్ ఎలా వున్నా. మరి ఇప్పుడు ఏంటీ? అక్కడే సమస్య వస్తోందట.కథలు వింటున్నాడు కానీ డిసైడ్ కాలేకపోతున్నాడంట. దీంతో దర్శకులు వేరే చోట ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పుడు జరిగింది అదే. 

లింగుస్వామి కలిసాడు.. లైన్ ఏదో చెప్పాడని వినికిడి. కానీ ఎన్టీఆర్ డిసైడ్ కాలేకపోయాడు. బన్నీ తో ఫిక్సయిపోయాడు. ఎన్టీఆర్ కు ఇప్పుడు కనీసం యాభై కోట్ల షేర్ తేగల డైరక్టర్ కావాలి? కానీ ఎవరు వున్నారు? పైగా ఆయనకేమో కాస్త లవ్, ఫ్యామిలీ డ్రామా లాంటి లైన్ కావాలి అంటున్నారట. అలాంటి సబ్జెక్ట్ ను అందరూ డీల్ చేయలేరు. కృష్ణ వంశీ, కొరటాల శివ, ఇలా సెలెక్టెడ్ దర్శకులు తప్ప. దాంతో ఏమీ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు.

మరి ఇంతకీ వంశీ పైడిపల్లి ని ఎందుకు అడగడం లేదో? వంశీ పైడిపల్లి తో సినిమా చేసే అవకాశం వున్న ఓ ప్రొడ్యూసర్ ను ఎవరో ఇదే విషయం అడిగితే,  ఎన్టీఆర్ తోనా..వద్దండీ..అనేసారట. అలాగే చిన్న, పెద్ద రెండు సినిమాలు కూడా హ్యాండిల్ చేయగల ఓ డైరక్టర్ దగ్గర మాటల మధ్యలో ఎవరో ప్రస్తావిస్తే, ఎన్టీఆర్ తోనా మనకు కష్టం అండీ అన్నాడట. అవును, ఇలా ఎన్టీఆర్ అంటే చాలా మంది ఎందుకు దూరంగా వుంటున్నట్లు? ఏమో?