Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ కు మాట మాత్రం చెప్పలేదు

ఎన్టీఆర్ కు మాట మాత్రం చెప్పలేదు

వాహ్.. చంద్రబాబు రాజకీయ చతురత. జస్ట్ రెండు రోజుల ముందు తన అనుకూల పత్రికల్లో ఫీలర్ వదిలారు. అంతవరకు జనాలకు కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు. రానివ్వలేదు. జస్ట్ ఓరోజు గడవకుండానే, విశాఖ రప్పించారు. టికెట్ ప్రకటించేసారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చేసాయి. వాటిల్లో భలేగా చొప్పించిన పాయింట్లు కొన్ని వున్నాయి. వాటిల్లో రెండు కీలకమైనవి.

నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఈ విధంగా చంద్రబాబు న్యాయం చేసారు.

కుటుంబసభ్యులను సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవం వేరుగా వుందని ఇప్పుడు తెలుస్తోంది. హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు పైకి వచ్చిన తరువాత నుంచి అధికారికంగా ప్రకటించే వరకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కాలు చంద్రబాబు నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యుల నుంచి కానీ హరికృష్ణ కుటుంబసభ్యులు ఎవరికీ రాలేదన్నది విశ్వసనీయ సమాచారం. ఈ కుటుంబ సభ్యుల్లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వున్నారన్నది వాస్తవం.

కేవలం నేరుగా సుహాసినిని, ఆమె దగ్గర వారు మరి కొందరిని సంప్రదించి బాబు ఈ నిర్ణయానికి వారిని ఒప్పించినట్లు తెలుస్తోంది. చంధ్రబాబు ఇలా చేయడం వల్ల హరికృష్ణ కుటుంబ సభ్యులు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పైకి ఏమీ మాట్లాడకుండా వుండిపోయినా, జరుగుతున్నది చూస్తూ, ఇంత రాజకీయమా? అని బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

మరి ఇలాంటి నేపథ్యంలో సోదరి కోసం కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారా? అన్నది అనుమానంగా వుంది. కేవలం కూకట్ పల్లిలో కమ్మ సామాజికవర్గానికి టికెట్ ఇవ్వాలనే వత్తిడి రావడంతో, మరెవరికి ఇచ్చినా పెద్దిరెడ్డి, తదితర ఆశావహులతో సమస్య వస్తుందని, ఈ విధంగా బహుళార్థకసాధక ఎత్తుగడ వేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఎప్పుడయితే హరికృష్ణ కుమార్తె అనగానే పార్టీలో మిగిలినవారు పైకి మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పటికే తెలుగుదేశం కోటాలో మరో ఇద్దరు కమ్మ సామాజికవర్గ జనాలకు టికెట్ లు కేటాయించారు. ఆ సంగతి అలా వుంచితే, హరికృష్ణ మరణం తరువాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారన్న టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు మాట మాత్రం సంప్రదించకుండా సోదరికి టికెట్ ఇవ్వడం అంటే మరేం అనుకోవాలో?

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?