Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ కు ప్లానింగ్ ప్రాబ్లమ్?

ఎన్టీఆర్ కు ప్లానింగ్ ప్రాబ్లమ్?

సీనియర్ హీరోలు నాగ్, బాలయ్య, వెంకీ, చిరు అందరికీ తలా ఒకటి రెండు సినిమాలు పైప్ లైన్ లో వున్నాయి. డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు రెడీ. మిడిల్ ఏజ్డ్ హీరోలు గోపీచంద్, సునీల్ లకు సైతం రెండే ప్రాజెక్టులు వున్నాయి.

ఇక యంగ్ టాప్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సంగతి చెప్పనక్కర లేదు. మరి ఎవరయ్యా, ఒక్క సినిమా కూడా సెట్ మీదనో, డిస్కషన్ లోనో లేనిది అంటే అది ఎన్టీఆర్ మాత్రమే.

పోనీ అలా అని చరిష్మా లేదు, మాస్ ఫాలోయింగ్ లేదు, నిర్మాతలు లేరు అనుకోవడానికి లేదు. డెభై కోట్లకు పైగా మార్కెట్ వుంది. నిర్మాతలు వున్నారు. కానీ ఎన్టీఆర్ నాన్ ప్లానింగ్ పుణ్యమా అని డైరక్టర్లు మాత్రం లేరు. 

సినిమా సెట్ మీద వుండగానే రెండేసి సినిమాలు ప్లాన్ చేసేస్తున్నారు అందరూ. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్లాన్ చేద్దామన్నా కలిసి రావడం లేదు. నాన్నకు ప్రేమతో సినిమా సమయానికి చేతిలో ఒక్క సినిమా లేదు. లండన్ నుంచి హడావుడిగా వచ్చి మరీ కొరటాల శివతో సినిమా సెట్ చేసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో టాక్ వినిపించింది.

మొత్తానికి చాలా కిందా మీదా పడిన తరువాత జనతా గ్యారేజ్ ఫిక్స్ అయింది. పోనీ జనతా గ్యారేజ్ షూట్ అవుతున్న సమయంలోనైనా తరువాత ఏంటీ? అన్నది ఫిక్స్ చేసుకుని వుంటే బాగుండేది. మరి అలా చేయలేదని అనుకోలేం. సెట్ కాలేదేమో అనే అనుకోవాలి.

తీరా జనతా గ్యారేజ్ లాంటి పెద్దహిట్ చేతిలో పడినా చేద్దామంటే సినిమా లేదు. త్రివిక్రమ్ కు ఎంత లాబీయింగ్ చేస్తున్నా ఎస్ అనడం లేదు నో అనడం లేదు అని తెలుస్తోంది. సురేందర్ రెడ్డిని వేరే వాళ్లు పట్టేసుకున్నారు.

వినాయక్, శ్రీను వైట్ల వున్నా ధైర్యం చేయలేకపోతున్నారు. నాని, నాగ్ మాదిరిగా కొత్తవాళ్లను పట్టుకునే ఆలోచన వున్నట్లు కనిపించడం లేదు. చందు మొండేటి లాంటి వాళ్లతో ప్రిలిమినరీ డిస్కషన్లు నడిచాయి కానీ, ముందుకు వెళ్లిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆయన కూడా వేరే వాళ్లతో వెళ్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ వుంటే మిగిలిన అర కొర డైరక్టర్లను కూడా ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారు. అప్పుడు నిర్మాతలు చేతిలో వున్నా డైరక్టర్లు వుండరు. పోనీ స్టార్ డైరక్టర్లు ఇప్పట్లో ఖాళీ అవుతారేమో అనుకున్నా, ఆరు నెలల నుంచి ఏడాది లోపు ఖాళీ అయ్యే స్టార్ డైరక్టర్ ఒక్కరు లేరు. ఇదంతా ప్లానింగ్ సమస్యే అనుకోవాలి మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?