ఎన్టీఆర్ నేర్చుకున్న పాఠం

జనతాగ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చినా వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు ఎన్టీఆర్. దీనికి కారణం ప్లానింగ్ లేకపోవడం తప్ప వేరు కాదు. అందుకే ఈ సారి ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. బాబీతో సిన్మా…

జనతాగ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చినా వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు ఎన్టీఆర్. దీనికి కారణం ప్లానింగ్ లేకపోవడం తప్ప వేరు కాదు. అందుకే ఈ సారి ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. బాబీతో సిన్మా స్టార్ట్ చేసాడు. మరో సినిమా త్రివిక్రమ్ తో కన్ ఫర్మ్ చేసుకుని వుంచుకున్నాడు. దానికి ప్రొడ్యూసర్లు కూడా రెడీ.

 అక్కడితో ఆగడం లేదు ఎన్టీఆర్. ఆ తరువాతి సినిమా కూడా ఫిక్స్ చేసేసుకున్నాడట. తనకు గతంలో మాంచి హిట్ లు ఇచ్చిన వినాయక్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయిపోయాడట. ఈ మేరకు వినయ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, స్క్రిప్ట్ రెడీ చేసుకోమన్నాడట. ఈ ప్రాజెక్టుకు అనుగుణంగానే మరే ప్రాజెక్టులైనా సెట్ చేసుకోమని ఎన్టీఆర్ వినయ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. 

బాబీతో చేసే సినిమా ఆగస్టు నాటికి పూర్తయిపోయే అవకాశం వుంది. అప్పటికి దర్శకుడు త్రివిక్రమ్ రెడీ కావాలి. అంటే పవన్ సినిమా నుంచి బయటకు రావాలి. కానీ అది సాధ్యమేనా? అన్నది అనుమానం. ఎందుకంటే పవన్-త్రివిక్రమ్ సినిమా ఏప్రియల్ నుంచి కానీ చకచకా నడిచే అవకాశం లేదు. అది ఎలా లేదన్నా అక్టోబర్ వరకు డేకేస్తుంది. అప్పుడు మళ్లీ ఎన్టీఆర్ ఖాళీగా కూర్చోవాలి. అందుకే వినాయక్ కనుక స్క్రిప్ట్ తో రెడీ అయిపోతే, ఆ సినిమాను పట్టాలెక్కించేయచ్చు. మొత్తానికి జనతా గ్యారేజ్ తరువాత వచ్చిన గ్యాప్ ఎన్టీఆర్ మంచి పాఠాలే నేర్పినట్లు కనిపిస్తోంది.