ఎన్టీఆర్ అలియాస్ జూనియర్ పై మైండ్ గేమ్ సాగుతోందా? ఎలాగైనా ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో..సంక్రాంతికి రాకుండా చేయాలన్న ఆలోచనతో కొందరు ఈ మైండ్ గేమ్ కు శ్రీకారం చుట్టారా? బాబాయ్ బాలయ్య బాబుకు, బుడ్డోడు ఎన్టీఆర్ కు చాలా కాలంగా పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. పోనీ ఒక దశలో ఎన్టీఆర్ దిగివచ్చి, కలుపుకుందాం అని కళ్యాణ్ రామ్ ద్వారా ప్రయత్నించినా, బాలయ్య బాబు ఠాఠ్ కుదరదని చెప్పేసాడన్నది టాలీవుడ్ లో ఓపెన్ టాక్.
ఇప్పుడు సంక్రాంతి బరిలోకి బాలయ్య బాబు డిక్టేటర్ వస్తుంటే, ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' కూడా వస్తోంది. ఎన్టీఆర్ సినిమాను రాకుండా చూడాలన్న ఆలోచనలు సాగాయని, కానీ కుదరలేదని గుసగుసలు వున్నాయి. కానీ ఇప్పుడు ఆఖరికి రెండు సినిమాలు విడుదల గ్యారంటీ అని తేలిపోయింది. ఎన్టీఆర్ సినిమా 14న విడుదలవుతోంది. డిక్టేటర్ కూడా దాదాపు అదే తేదీల్లో వస్తోంది.
ఇప్పుడు కొందరు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మీద మైండ్ గేమ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, ఓ మధ్యవర్తి కలుగచేసుకున్నారని, దాంతో ఎన్టీఆర్ స్వయంగా బాబాయ్ కు ఫోన్ చేసి మాట్లాడారని వార్తలు వినవచ్చాయి. దీంతో ఒక వారం వెనకకు తన సినిమా విడుదల మారుస్తారని కూడా వార్తలు పుట్టించారు. కానీ అసలు విషయం వేరు అని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఫోన్ చేసిందీ లేదు.. మాట్లాడిందీ లేదు అని ఆయనతో టచ్ లో వండే వర్గాల బోగట్టా. అయితే మరెందుకు ఈ గ్యాసిప్ పుట్టించారు అంటే, నయానో, భయానో, ధియేటర్లు దొరకకుండానో చేసి,ఎన్టీఆర్ సినిమాను వారం వెనక్క జరిపే ప్రయత్నాలు అయితే ఇంకా సాగుతున్నాయట. అయితే అవి ఫలించి, సినిమా వెనక్కువెళ్తే, ఇందులో ఎవరి హస్తమూలేదు, ఎన్టీఆర్ తన బాబాయ్ బాలయ్యతో రాజీ పడి,ఇలా చేసాడని జనం అనుకోవాలన్నది మాస్టర్ ప్లాన్ అంట.
నిజానికి ఎన్టీఆర్ కు బాలయ్యకు రాజీకావాలంటే వేరే మధ్యవర్తి అక్కరలేదు. ఇద్దరి నడుమ కళ్యాణ్ రామ్ వుండనే వున్నారు. ఇంటి మనిషి. ఆయన కన్నా ఇద్దరి దగ్గర చనువు వుండే దెవరికి? అందువల్ల ఈ మేరకు పుట్టిన వార్తలన్నీ …ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.
డిక్టేటర్..నాన్నకు ప్రేమతో..రెండూ హిట్ అయితే సమస్యే లేదు.
డిక్టేటర్ హిట్ అయి..నాన్నకు ప్రేమతో కాకపోయినా ఫరవా లేదు. ఎందుకంటే కాస్త డౌన్ ట్రెండ్ లో వున్న ఎన్టీఆర్ కు మరి కాస్త బాధ తప్ప, పోయే ప్రెస్టీజ్ ఏమీ లేదు. కానీ అదే బాలయ్య సినిమా ఫ్లాప్ అయి, ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే..ఇలా అలా వుండదు. అసలే బాలయ్యకు ప్రెస్టీజ్ అంటే ఇంతా అంతా కీలకం కాదు. పైగా ఇప్పుడు ఆంధ్రలో అధికారం.. ఎమ్మెల్యే.. ఇన్నీ చాలా వుంది వ్యవహారం.
అందువల్ల రెండు సినిమాలు ఢీకొనకూడదని తెరవెనక ప్రయత్నాలు ఇంకా ముమ్మరంగా సాగుతూనే వున్నాయి. దాంట్లో పార్ట్ నే ఈ గ్యాసిప్ ల మైండ్ గేమ్ అని వినికిడి.