ఎన్టీఆర్‌ రేంజ్‌కి పెరిగిపోయింది

సందీప్‌ కిషన్‌ నుంచి గోపీచంద్‌ నుంచి రవితేజకి… ఇలా నెమ్మదిగా నిచ్చెన ఎక్కేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇక టాప్‌ లీగ్‌లోకి చేరిపోవడానికి సిద్ధంగా ఉంది. సూపర్‌స్టార్స్‌తో ఇంతవరకు నటించని రకుల్‌ ప్రీత్‌కి ఎన్టీఆర్‌తో…

సందీప్‌ కిషన్‌ నుంచి గోపీచంద్‌ నుంచి రవితేజకి… ఇలా నెమ్మదిగా నిచ్చెన ఎక్కేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇక టాప్‌ లీగ్‌లోకి చేరిపోవడానికి సిద్ధంగా ఉంది. సూపర్‌స్టార్స్‌తో ఇంతవరకు నటించని రకుల్‌ ప్రీత్‌కి ఎన్టీఆర్‌తో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ వచ్చిందని తెలిసింది. 

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో రూపొందే చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ కథానాయికగా ఎంపికైందట. ఎన్టీఆర్‌తో ఇంతవరకు నటించని హీరోయిన్‌ అయితే బాగుంటుందని అనుకున్న సుకుమార్‌ కొంతమంది కొత్త హీరోయిన్లని కన్సిడర్‌ చేసాడట. అయితే ఆల్రెడీ అనుభవం ఉండీ… యువతలో కాసింత గుర్తింపు ఉన్న రకుల్‌ అయితే బెటర్‌ అని భావించాడట. 

అదే సంగతి ఎన్టీఆర్‌కి చెబితే అతనూ సానుకూలంగా స్పందించాడని, రకుల్‌కి ఈ సినిమా దాదాపు ఓకే అయిపోయినట్టేనని సినీ వర్గాలంటున్నాయి. ఎన్టీఆర్‌ రేంజ్‌కి ఎదిగిందంటే ఇక మిగిలిన అయిదుగురు అగ్ర హీరోలతోను నటించడమే తరువాయి. వచ్చే రెండేళ్లలో ఆల్‌ టాప్‌ హీరోస్‌తో నటించిన ముచ్చట తీరిపోవడం గ్యారెంటీ.