“మీడియా ఊహించుకున్నంత ఎమౌంట్ మాత్రం తీసుకోవట్లేదు. కానీ నేను తృప్తి చెందేంత డబ్బు మాత్రం నాకిచ్చారు”. బిగ్ బాస్ షో చేయడానికి ఎంత తీసుకున్నారనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిది. అయితే తారక్ ఈ షో కోసం ఎంత తీసుకుంటున్నాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. ఒక ఎపిసోడ్ కు 50 లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నాడట ఎన్టీఆర్. సీజన్ లో ఎన్టీఆర్ తో 12 ఎపిసోడ్లు ప్లాన్ చేశారట. అంటే ఒక సీజన్ కు ఎన్టీఆర్ 6 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడన్నమాట.
మొత్తంగా బిగ్ బాస్ షోను 3 సీజన్లు నడిపించాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ మొత్తం పారితోషికం 18 కోట్ల రూపాయలన్నమాట.
ఈ నెల 16 నుంచి స్టార్ మాలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రతి షోలో ఎన్టీఆర్ కనిపించడు. అందులో పాల్గొంటున్న వాళ్లు మాత్రమే కనిపిస్తారు. వారాంతాల్లో మాత్రమే ఎన్టీఆర్ వస్తాడు.
యాంకరింగ్ చేసి వెళ్లిపోతాడు. అలా కనిపించేందుకే ఎపిసోడ్ కు 50 లక్షలు చార్జ్ చేస్తున్నాడు తారక్. ఇలా చూసుకున్నా గతంలో నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే ఇది ఎక్కువే.