ఎన్టీఆర్ సమస్య ఏమిటి?

టాలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక ప్రశ్న.. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 విడుదల ఎప్పుడు? మందుగా అనుకున్న డేట్ జనవరి 25 లేదా 26.. తరువాత ప్రకటించినది ఫిబ్రవరి 7.. వినిపిస్తున్న డేట్ లు…

టాలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక ప్రశ్న.. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 విడుదల ఎప్పుడు? మందుగా అనుకున్న డేట్ జనవరి 25 లేదా 26.. తరువాత ప్రకటించినది ఫిబ్రవరి 7.. వినిపిస్తున్న డేట్ లు ఫిబ్రవరి 15 లేదా 22… కానీ వినిపిస్తున్న మరో గ్యాసిప్ ఏకంగా సమ్మర్ కే వెళ్లిపోవచ్చు అని.

అసలు ఏమిటి సమస్య? ఎన్టీఆర్ బయోపిక్ ను జనవరి మూడోవారంలోనే విడుదల చేసేస్తానని క్రిష్ తెగ పట్టుపట్టారు. అప్పట్లో యూనిట్ అంతా దీన్ని వ్యతిరేకించినా, నిర్ణయాన్ని బాలయ్య క్రిష్ కే వదిలేసారు. తీరా సినిమా ఫస్ట్ పార్ట్ పూర్తయ్యే టైమ్ కు రెండోపార్ట్ ను ఫిబ్రవరికి వాయిదా వేసారు.

ఈ లెక్కన రెండోపార్ట్ బ్యాలెన్స్ వర్క్ మీద క్రిష్ కు పూర్తి అవగాహన వుండి వుండాలి. కానీ రెండోభాగం షూటింగ్ ఫిబ్రవరి 2 వరకు కొనసాగింది. రెండోభాగంలో ఎమోషన్ కంటెంట్, సినిమాటిక్ కంటెంట్ పెంచి, మార్పులు చేర్పులు చేయడమే ఇందుకు కారణం అని గ్యాసిప్ లు వినిపించాయి.

ఇదిలావుంటే సినిమాకు రీరికార్డింగ్, డీటీఎస్, సీజీలు వగైరా పనులు ఇంకా చాలా పెండింగ్ లో వున్నాయని, అన్నీకలిపి 20 వరకు వర్క్ పూర్తయ్యే అవకాశాలు లేవని ఇప్పుడు వినిపిస్తోంది. యూనిట్ ఏ విషయం చెప్పడంలేదు. అసలు ఏడు నుంచి వాయిదా అన్నదే ఇంతవరకు బయటకురాలేదు. ప్రచారంలేదు కాబట్టి వాయిదా అన్నది పక్కా అయిపోయింది.

మరి 15 లేదా 22ల్లో ఏది కన్ ఫర్మ్ అన్నది కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ట్రేడ్ సర్కిళ్లలో 15కు రావడం ఇంపాజిబుల్ అనే వినిపిస్తోంది. అంతేకాదు, అసలు 22కు రావాలంటే కూడా డే అండ్ నైట్ వర్క్ చేయాలని టాక్. ఏమాత్రం తేడా వచ్చినా, ఇక సమ్మర్ కే వెళ్లిపోతుంది ఎన్టీఆర్ మహానాయకుడు అంటున్నారు.

బయ్యర్లు బయటవాళ్లు కాదు, సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, క్రిష్, 14 రీల్స్ ఇలా అంతా బాలయ్య సన్నిహితులే. అందుకే ఎవరికీ ఏమీ చెప్పకున్నా, అలా మౌనంగా వెయిట్ అండ్ వాచ్ లో వున్నారని టాక్.

వైసీపీ వీటిని పట్టించుకోకపోవడం వారికే మేలు!

వినయ విధేయ, మజ్ను, పేటా కలిసి పోగొట్టుకున్నవే 70 కోట్లకు పైగా