ఎన్టీఆర్ టీజర్ షూట్

ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఆగిపోయిన షూట్ ఇప్పుడు తిరిగి మొదలయింది. అయితే అలా అని టాప్ హీరోలు ఇద్దరూ అర్జెంట్ గా సెట్ మీదకు వస్తున్నారనుకుంటే పొరపాటే అని తెలుస్తోంది.…

ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఆగిపోయిన షూట్ ఇప్పుడు తిరిగి మొదలయింది. అయితే అలా అని టాప్ హీరోలు ఇద్దరూ అర్జెంట్ గా సెట్ మీదకు వస్తున్నారనుకుంటే పొరపాటే అని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇప్పటికి రామ్ చరణ్ మీద ఒక విడియో బైట్ కట్ చేసారు. ఎన్టీఆర్ మీద ఇప్పటి వరకు రాలేదు. 

దాని కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు రాజమౌళి ఆ పనిలోనే వున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు, రేపు ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించి షూట్ ను పూర్తి చేస్తారు. ఆ పైన ఇక ఇద్దరు హీరోలకు సంబంధం లేని సీన్లు ఏరి కోరి వాటిని పది రోజుల పాటు చిత్రీకరిస్తారు. 

ఆ తరువాత పరిస్థితిని బట్టి ముందుకు వెళ్తారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ప్రారంభమైంది. పైగా ఎన్టీఆర్ టీజర్ రాబోతోంది. అది కూడా ఈ దసరాకు. ఇవన్నీ సినిమా అభిమానులకు కచ్చితంగా ఆనందకరమైన వార్తలే.

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి