cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ టాప్ 5లోకి వస్తాడా?

ఎన్టీఆర్ టాప్ 5లోకి వస్తాడా?

ఆంధ్ర, తెలంగాణ డొమస్టిక్ టాలీవుడ్ మార్కెట్ లో ఫస్ట్ డే షేర్ అన్నది పెద్ద హీరోలకు కీలకం. సినిమా విజయాపజయాలు ఎలా వున్నా, ఫస్ట్ డే రికార్డ్ అన్నది అభిమానులు కీలకంగా భావిస్తారు. ఫస్ట్ డే టాప్ టెన్ లో ఎన్టీఆర్ కు జనతాగ్యారేజ్, జైలవకుశ వున్నాయి. అయితే టాప్ ఫైవ్ లో మాత్రం ఒక్కటీలేదు. టాప్ ఫైవ్ లో బాహుబలినే రెండు ఫ్లేస్ లు (22 కోట్లు..42 కోట్లకు పైగా) ఆక్యుపై చేసేసింది.

ఇక మిగిలిన మూడు ప్లేస్ ల్లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, కాటమరాయుడు (27 కోట్లు, 23 కోట్లు) వున్నాయి. మిగిలిన ప్లేస్ ను చిరంజీవి ఖైదీ 150 తీసేసుకుంది. ఇప్పడు ఎన్టీఆర్ టాప్ ఫైవ్ లోకి రావాలి అంటే ఫస్ట్ డే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23కోట్లు వసూళ్లు సాధించాలి.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్, అరవింద యూనిట్ ఫస్ట్ డే పాతిక కోట్లకు పైగానే వసూళ్లు వుంటాయని అంచనా వేస్తోంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఫస్ట్ డే బాహుబలి రికార్డు తరువాత అరవిందదే వుంటుందని గట్టిగా చెబుతున్నారు. దాదాపు 1500 కు పైగా స్క్రీన్లలో అరవింద సమేత విడుదలవుతోంది.

పైగా ఆంధ్ర, సీడెడ్ అంతా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ప్లాన్ చేసారు. తెల్లవారుఝామునే అన్నిచోట్లా షోలు పడిపోతున్నాయి. కేవలం నైజాంలో మాత్రమే రెగ్యులర్ షోలు వుంటాయి. అందువల్ల టోటల్ గా చూసుకుంటే ఈసారి ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ డే రికార్డుల్లో టాప్ ఫైవ్ ల్లోకి రావడం పక్కగా కనిపిస్తోంది.