టాలీవుడ్ లో చాలా మంది ఎదురుచూస్తున్నది ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసమే. ఈ సినిమా మీద అంచనాల కన్నా ఆసక్తి ఎక్కువ వుంది. ఈ సినిమా దసరాబరిలోకి వస్తుందని వార్తలు వున్నాయి. అయితే లేటెస్ట్ విషయం ఏమిటంటే, ఈ సినిమా 2019సంక్రాంతి బరిలోకి వస్తుందన్నది.
ఎన్టీఆర్ తో సినిమా షూట్ ఇంకా ప్రారంభం కాలేదు. ఎన్టీఆర్ కసరత్తులు, మేకోవర్ వంటి వ్యవహారాలే ఇంకా నడుస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా స్పీడ్ గా ఈ సినిమాను తీసే ఆలోచనలో వున్నారని గతంలో వార్తలు వినవచ్చాయి. స్క్రిప్ట్ రెడీగా వుందని, గతంలో లాగా కాకుండా చాలా స్పీడ్ గా ఈ సినిమాను ఫినిష్ చేస్తానని తివిక్రమ్ పంతంగా వున్నారని కూడా వార్తలు వున్నాయి. అందుకే దసరా బరిలోకి ఈ సినిమా వస్తుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ప్లానింగ్ మారుతోందని, సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ఏప్రియల్ నుంచి చేసినా, కనీసం ఆరు నెలలు పడుతుంది అనుకున్నా, అక్టోబర్ దాటిపోతుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే దసరా వుంది. నవంబర్ లో దీపావళి వుంది కానీ, సినిమా మార్కెట్ రీత్యా అది అంత సరిపోదు. అందుకే సంక్రాంతి బరిలో దిగడానికే టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు సంక్రాంతికి టార్గెట్ చేసి ఏ సినిమా రెడీ కావడం లేదు. బాలయ్య బయోపిక్ ఒక్కటే ఆ ఆలోచనలో వుందని వినికిడి. కానీ అది జూన్ నుంచి కానీ పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యే సూచనలు లేవు. సంక్రాంతికి రెడీ అవుతుందా? అన్నది అనుమానం. రామ్ చరణ్-బోయపాటి సినిమా సంక్రాంతికి ముందే వచ్చేసే అవకాశం వుంది. అందువల్ల సంక్రాంతి అన్నది బెస్ట్ చాయిస్ అని హారిక హాసిని యూనిట్ ఫిక్స్ అయినట్లు బోగట్టా.