ఓ కాప్ బయోపిక్

ఓ పాత్రను తీసుకుని దాని చుట్టూ కొంత కథ అల్లడం, లేదా ఆ పాత్ర జీవితంలోని కొంత భాగాన్ని కథగా అల్లడం మామూలే. అయితే ఇటీవల ఓ పాత్ర ను తీసుకుని ఆది నుంచి…

ఓ పాత్రను తీసుకుని దాని చుట్టూ కొంత కథ అల్లడం, లేదా ఆ పాత్ర జీవితంలోని కొంత భాగాన్ని కథగా అల్లడం మామూలే. అయితే ఇటీవల ఓ పాత్ర ను తీసుకుని ఆది నుంచి అంతం వరకు సినిమాగా మార్చడం మొదలైంది. ఇవి ఓ తరహా బయోపిక్ లు అనుకోవాలి. అలాంటి బయోపిక్ మరోటి వస్తోంది. ఇది ఓ పోలీస్ ఆఫీసర్ బయోపిక్ అనుకోవాలి. 

శ్రీవిష్ణు హీరోగా ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ కాప్ బయోపిక్ రూపొందుతుంది.  రియలిస్టిక్ పోలీస్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.  శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. 

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.