ఒక్క హిట్టు.. ఎందరికో ఆనందం

సినిమా హిట్ అయితే నిర్మాతకు, బ్యానర్ కు, హీరోకు, డైరక్టర్ కు అందరికీ ఆనందమే. అయితే గూఢచారి సినిమా హిట్ అన్నది అంతకు మించి.. ఎందుకంటే ఒక్క చాన్స్.. ఒక్క చాన్స్ అన్నట్లుగా.. ఒక్క…

సినిమా హిట్ అయితే నిర్మాతకు, బ్యానర్ కు, హీరోకు, డైరక్టర్ కు అందరికీ ఆనందమే. అయితే గూఢచారి సినిమా హిట్ అన్నది అంతకు మించి.. ఎందుకంటే ఒక్క చాన్స్.. ఒక్క చాన్స్ అన్నట్లుగా.. ఒక్క హిట్.. ఒక్క హిట్ అన్నట్లు ఎదురుచూస్తున్న వారందరికీ ఈ సినిమా హిట్ ఇచ్చింది.

అనిల్ సుంకర. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్. హిట్ అన్నదాన్ని చవిచూసి చాలాకాలం అయింది. ఈ సినిమా కథ ఆ కాంపౌండ్ లో తయారయిందే. సినిమాకు బ్యాక్ ఎండ్ లో అనిల్ సుంకర వుంటూ వచ్చారు. ఆఖరికి ఫైనల్ కాపీ థియేటర్ రైట్స్ ను నాలుగు కోట్లకు ఆయనే కొన్నారు. ఆ విధంగా ఈ హిట్ ఆయనకు హ్యాపీ.

ఇక పీపుల్స్ మీడియా సంస్థ. మంచి సినిమాలు తీస్తూ వస్తోంది. కానీ పూర్తి సంతృప్తికర ఫలితాలు రావడంలేదు. అలాంటిది గూఢచారి సినిమా హిట్ వాళ్లకీ మాంచి ఆనందంగా వుంది. అభిషేక్ నామా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. ఆయన సరైన హిట్ కోసం చూస్తున్నారు. సాక్ష్యం సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. అలాంటి టైమ్ లో ఈ విజయం ఆయనకూ భయంకరమైన ఆనందాన్నిచ్చింది.

వివేక్ కూచిభొట్ల ఈ మధ్య వరుసగా సినిమాల నిర్మాణంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. కానీ విజయాలు సరిగ్గా వరించలేదు. ఇప్పుడు ఆయనకూ మహదానందం. క్షణం సినిమా తరువాత అడవి శేష్ ప్రయత్నం ఇది. ఇది హిట్ కావాలని ఎంత టెన్షన్ పడ్డాడో సన్నిహితంగా వున్నవారికి తెలుసు. ఇప్పుడు ఆ టెన్షన్ ఏ రేంజ్ ఆనందంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

మొత్తంమీద ఒక్క హిట్ ఇంత మందికి ఆనందాన్ని పంచింది.