Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒక్కమనసు..హైప్ రావడం లేదేలనో?

ఒక్కమనసు..హైప్ రావడం లేదేలనో?

ఎంత చేసినా..ఒక్కోసారి ఎందుకో సినిమాలకు బజ్ రావడం కష్టమైపోతుంటుంది. ఒక్క మనసు సినిమా వ్యవహారం అలాగే కనిపిస్తోంది. సినిమా పూర్తయిపోయింది. విడుదల డిసైడ్ అయిపోయింది. కానీ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ వుందా అన్నది అనుమానం. అడియో ఫంక్షన్ చేసినపుడు కాస్త జనాలకు ఆసక్తి కలిగింది. తరువాత అది మళ్లీ చప్పబడిపోయింది. ఇది టీవీ 9 నిర్మాణం కావడంతో మిగిలిన  చానెళ్లు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనికి తోడు ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి.హీరో ఆయన తరువాతి సినిమాలో ఆయన బిజీగా వున్నాడు. డైరక్టర్ ఎక్కడా మాట్లాడుతున్న సందర్భాలు కనిపించడం లేదు. హీరోయిన్ కాస్త ట్విట్టర్ ల్లోనో, ఫేస్ బుక్ ల్లోనో హడావుడి చేస్తున్నారు.

మెగా హీరోయిన్ నీహారిక ఈ సినిమాలో వుండడమే ఫస్ట్ అండ్ ఫైనల్ అట్రాక్షన్. అప్పటికీ ఆమె తమ కుటుంబ హీరోల ఆనవాయితీ ప్రకారం మెగా ఫ్యాన్స్ ను అందరినీ పిలిచి, సమావేశం పెట్టి హడావుడి చేసారు. అయినా ఫ్యాన్స్ లో ఆ సినిమా మీద పెద్ద ఆసక్తి కలిగించలేకపోయారని వినికిడి. సినిమా పాటలు క్లాస్ గా వున్నాయి..ఎఫ్ఎమ్ లో మారు మోగుతున్నాయి. అది వాస్తవం. కానీ అవి ఓపెనింగ్స్ కు ఎంత వరకు సాయం చేస్తాయన్నది చూడాలి.

సినిమా తక్కువలోనే అంటే రెండు నుంచి మూడు కోట్ల లోపు ఖర్చుతోనే ఫినిష్ చేయగలిగారు. మంచి లాభాలకు ప్రారంభంలోనే బయ్యర్లను సెట్ చేసుకోగలిగారు. దాంతో అంతకు అంతా లాభాలు వచ్చేపరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ ల దగ్గరకు వచ్చేసరికి బయ్యర్లు బేరాలాడుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. సరైన సినిమాలు ఏవీ మార్కెట్ లో లేకపోవడం అన్నది ఓ ప్లస్ పాయింట్. ఆ వేళకు అ..ఆ, జెంటిల్ మన్ తప్ప మరో సినిమా ఏదీ పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి వుండదు. ముందు వారం విడుదలయ్యే జెంటిల్మెన్ ఫలితం కూడా ఈ సినిమా మీద ప్రభావం చూపించే అవకాశం వుంది.

యూత్ లవ్ స్టోరీ కాబట్టి, ఏ మాత్రం బాగున్నా సినిమా లాగేస్తుంది. కానీ భయంకరమైన ఓపెనింగ్స్ ఆశించడం కాస్త కష్టమే. ఇక వారమే వుంది కాబట్టి, ఏ హైప్ తీసుకురావాలన్నా ఇదే సమయం. మరి దాని మీద అంతగా దృష్టి పెడుతున్నట్లు లేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?