Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒక్క త్రివిక్రమ్..ఎంత మందితో?

ఒక్క త్రివిక్రమ్..ఎంత మందితో?

మాంచి ఆల్ రౌండ్ హిట్ కావాలనుకునే ప్రతి హీరో చూపు త్రివిక్రమ్ మీదనే. అయితే ఆయనేమో.. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ లతోనే చేస్తూ వస్తున్నాడు. ఏదో మధ్యలో మరెవరు దొరక్క నితిన్ తో చేసారు. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న అ..ఆ తరువాత త్రివిక్రమ్ సౌత్ ఇండియా లెవెల్ సినిమా సూర్యతో చేయాలని రెడీ అవుతున్నారు. 

కానీ కాస్త గ్యాప్ వుంది. ఈ గ్యాప్ లో ఓ సినిమా చేసేద్దామని గతంలోనే బన్నీ అడిగినట్లు వార్తలు వచ్చాయి. సరైనోడు విడుదల తరువాత ఈ వార్తలు మరోసారి వినిపిస్తున్నాయి. విక్రమ్ కుమార్ తో ద్విభాషా చిత్రం చేయబోతున్నానని బన్నీ స్వయంగా చెప్పాడు. కానీ దానికీ కాస్త గ్యాప్ వుంది. 

ఇలా ఎలా లేదన్నా త్రివిక్రమ్ కు బన్నీకి మూడు నెలల వంతున గ్యాప్ వస్తోంది. మరి ఆ గ్యాప్ లో సినిమా చేస్తారో చేయరో? ఇదిలా వుంటే మనం కలిసి మరో సినిమా చేద్దామని పవన్ కూడా త్రివిక్రమ్ తో ఓ మాట అన్నారని టాక్ వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం పవన్-సూర్య కాంబినేషన్ సినిమాకే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందువల్ల త్రివిక్రమ్-బన్నీ సై అంటే సై అనుకుంటేనే ఓ సినిమా వచ్చే అవకాశం వుంది. లేదంటే లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?