రాజుగారి గది 2 అంటూ ఏకంగా నాగార్జునతోనే సినిమా చేసే చాన్స్ కొట్టేసాడు ఎంకర్ కమ్ దర్శకుడు ఓంకార్. నిజానికి మైసూర్ బోండాలో మైసూర్ టైపు ఇది. రాజుగారి గదికి ఈ సినిమాకు ఏమీ సంబంధం లేదు. టైటిల్ మాత్రమే. వేరే కథకు ఈ టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు.
ఈ నెల మూడోవారంలో ఈ సినిమా కు పూజ తదితర వ్యవహారాలు ప్రారంభం కావాల్సి వుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ సంగతేమిటంటే, ఓంకార్ తెచ్చిన రీమేక్ కథకు నాగార్జున కొన్ని మార్పులు, చేర్పులు సూచించినట్లు తెలిసింది. ఓంకార్ ఈ మార్పులు చేర్పులు చేసుకుని వచ్చి, నాగ్ చేత ఓకె చేయించుకోవాల్సి వుంటుంది.
ఇన్నేళ్ల అనుభవంతో నాగ్ చెప్పిన మార్పులు చేయడం అంటే అంత సులువు కాదు. ఈ టెస్ట్ పాస్ అయితే ఓంకార్ సినిమా సర్రున ముందుకెళ్లిపోతుంది. కానీ ఈ టెస్ట్ దగ్గరే ముందు వెనుకలు ఆడితే మాత్రం నాగ్ తో కాస్త కష్టం.