అవసరం వున్నవాడు ఒకర్ని నమ్ముకుంటాడు. అవసరం-అవకాశం రెండూ వున్నవాడు ముగ్గుర్ని నమ్ముకుంటాడు. టాలీవుడ్ లో ఓ దర్శకుడికి అర్జెంట్ గా గాట్టి కవరేజ్ కావాల్సి వచ్చింది. పైగా చేతిలో కరోనా కారణంగా సినిమా లేదు.
తరువాత సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అంతకు మించి పెద్ద సినిమా చేయాల్సి వుంది. అదెప్పుడు వస్తుందో తెలియదు.
అందుకే లైమ్ లైట్ లో వుండాలంటే పీఆర్ అవసరం అని ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒక అకేషన్ వుంటే బెటర్. అలా అకేషన్ కు ఒక పీఆర్ ను నమ్ముకంటే ఎలా? ఒక మీడియాలో రావచ్చు. మరో మీడియాలో రాకపోవచ్చు. అందుకే ఏకంగా ముగ్గురు పీఆర్ లను హైర్ చేసినట్లు బోగట్టా.
ఇక ఆ పీఆర్ టీమ్ ఎవరి శక్తి కొలది వారు ట్వీట్ లు వేయించడం, పోస్ట్ లు పెట్టించడం, డిజైన్ కార్డులు వదలడం, ఆర్టికల్స్ ప్రమోట్ చేయించడం. ఇలా తెగ హడావుడి హల్ చల్ చేసారు. అదే రోజు మరి కొంతమంది డైరక్టర్ లకు కూడా అకేషన్లు వచ్చాయి. కానీ పాపం వారి గురించి పట్టించుకున్నవారు లేరు.
ఈయన మాత్రం తెలివిగా ఒకేసారి ముగ్గురు పీఆర్ లను హైర్ చేసి విపరీతమైన కవరేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఒకటే అనుమానం సినిమాల్లో సత్తా వుండాలి కానీ ఈ పర్సనల్ మార్కెటింగ్ హడావుడి వల్ల ఏం ఒరుగుతుంది? పీఆర్ టీమ్ కు ఫీజులు ఖర్చు తప్ప?