ఓరి నా విక్రమ్ గెటప్పులో..

హీరో విక్రమ్ కూడా కమల్ హాసన్ టైపే. డిఫరెంట్ రోల్స్ కి డిఫెరంట్ గెటప్ ల క్రేజ్ ఎక్కువ. ఇరు మగన్ పేరుతో తమిళంలో తయారవుతున్న(తెలుగులో  ఇంకొక్కడు ) ట్రయిలర్ బయటకు వచ్చింది ఈ…

హీరో విక్రమ్ కూడా కమల్ హాసన్ టైపే. డిఫరెంట్ రోల్స్ కి డిఫెరంట్ గెటప్ ల క్రేజ్ ఎక్కువ. ఇరు మగన్ పేరుతో తమిళంలో తయారవుతున్న(తెలుగులో  ఇంకొక్కడు ) ట్రయిలర్ బయటకు వచ్చింది ఈ రోజు. దీంతో ఈ గెటప్ ల విషయం మరోసారి రుజువైంది. అన్ని గెటప్ లు ఒక ఎత్తు అటు ఇటు కానీ థర్డ్ జెండర్ గా విక్రమ్ కనిపించడం ఒక ఎత్తు. 

సాధారణంగా లీడింగ్ హీరోలు జస్ట్ కాజువల్ గా కావాలంటే ఇలాంటి మాడా టైపు గెటప్ లో ఓసారి కనిపిస్తారు కానీ ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించడం అన్నది ఊహించడం కాస్త కష్టం. విక్రమ్ ఇప్పుడు ఆ పనికి తెరతీసాడు. అందుకోసం కాస్త డిఫరెంట్ గా తయారయ్యాడు. గే గా హావభావాలు పండించాడు. 

Watch Iru Mugan Trailer

పైగా ఈ క్యారెక్టర్ సినిమాలో విలన్ కూడా కావడం విశేషం. అందుకే తన ప్రతిభకు మరింత పదును పెట్టాడు. విక్రమ్ కు వైవిధ్యమైన సినిమాలు కొత్తకాదు, గెటప్ లు కొత్తకాదు. అలాగే అలాంటివి చాలా వరకు మన బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేయడం అంతకన్నా కొత్త కాదు. మరి ఈ సినిమా ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ.