ఎంత ఎక్కువ బడ్జెట్ ఇచ్చినా కానీ 'పర్‌ఫెక్షన్' పేరిట మరింత ఖర్చు పెట్టించేస్తుంటాడని త్రివిక్రమ్‌పై కంప్లయింట్ వుంది. అతడు, జల్సా నుంచి త్రివిక్రమ్ సినిమాలన్నీ ఓవర్ బడ్జెట్ అవుతూనే వచ్చాయి. దీంతో బయటి నిర్మాతలకి మానేసి తనతోనే సినిమాలు తీసే రాధాకృష్ణ బ్యానర్‌కే త్రివిక్రమ్ పరిమితమయ్యాడు.
సొంత బ్యానర్ అయినా కానీ ఇక్కడా మనీ మేనేజ్‌మెంట్ విషయంలో త్రివిక్రమ్ తగిన జాగ్రత్తలేం తీసుకోవడం లేదు. 'అ ఆ' చిత్రాన్ని తక్కువలో పూర్తి చేయాలని మొదలు పెట్టారు కానీ అది బడ్జెట్ మించిపోయింది. లక్కీగా ఆ చిత్రం పెద్ద హిట్ అవడంతో నిర్మాత బయట పడ్డాడు. అంత పెద్ద హిట్ అయిన 'అఆ'తో నిర్మాతకి వచ్చిన లాభాలు చాలా తక్కువ అంటారు.
తాజాగా పవన్‌కళ్యాణ్ చిత్రాన్ని చేస్తోన్న త్రివిక్రమ్ దీనికి ముందుగానే వంద కోట్ల బడ్జెట్ ఇచ్చాడట. అయితే అది కూడా పెరుగుతూ పోతోందని, ఈ చిత్రానికి బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతూ వుండడం వల్ల నిర్మాత కంప్లయింట్ చేయడం లేదు కానీ లేదంటే ఈ పాటికి ప్యానిక్ వాతావరణం వుండేదని చెబుతున్నారు. సగటు కమర్షియల్ సినిమానే అయినప్పటికీ దీనిపై త్రివిక్రమ్ ఎందుకింత ఖర్చు పెట్టిస్తున్నాడనేది ఫైనల్ ప్రాడక్ట్ చూస్తే కానీ తెలీదు.