ఓవర్ సీస్ మార్కెట్ హవాలాకు దారి తీస్తోందా?

ఓవర్ సీస్ మార్కెట్, వసూళ్లపై టాలీవుడ్ లో ఇప్పుడు కొత్తరకం గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోలు తమ పరువు నిలబెట్టుకునేందుకు, తమ మార్కెట్ విస్తృతి పెంచుకునేందుకు, ఓవర్ సీస్ మార్కెట్ ను ‘తయారు’ చేస్తున్నట్లు గుసగుసలు…

ఓవర్ సీస్ మార్కెట్, వసూళ్లపై టాలీవుడ్ లో ఇప్పుడు కొత్తరకం గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోలు తమ పరువు నిలబెట్టుకునేందుకు, తమ మార్కెట్ విస్తృతి పెంచుకునేందుకు, ఓవర్ సీస్ మార్కెట్ ను ‘తయారు’ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ల సాయంతో, చాలా తెలివైన వ్యూహం రచించి అమలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఉదాహరణకు ఓ సినిమాకు ఓవర్ సీస్ లో కలెక్షన్లు కావాలంటే అక్కడి అస్మదీయుల సాయంతో టికెట్ లు కొనిపిస్తారు. ఉదాహరణకు ఓ అయిదు కోట్ల మేరకు టికెట్ లు కొనిపించారనుకోండి. అది ముందుగానే బయ్యర్ కు తెలియ చేస్తారు. బయ్యర్ ద్వారానే ఈ వ్యవహారం నడిపిస్తారు. అయిదు కోట్లలో థియేటర్ తదితర ఖర్చులు పోను కనీసం మూడు కోట్లు వెనక్కు వస్తాయి. అక్కడికి లాస్ రెండు కోట్లు. ఈ రెండు కోట్లు ఇండియాలో బయ్యర్ తాలూకు జనాలకు అందిస్తారు.

రెండు కోట్లు లాస్ అయి పరువు నిలబెట్టుకున్నా నష్టమేం లేదు. ఎందుకంటే సదరు హీరో రేంజ్ పెరిగినట్లు కనిపిస్తుంది కనుక తరువాతి సినిమాకు కనీసం ఓ కోటి అదనంగా వసూలు చేస్తారు. అలాగే ఈ వసూళ్లు చూపించి రెమ్యూనిరేషన్ లో ఓ అరకోటి లాగేస్తారు.  అంటే అక్కడికి ఓ అరకోటి రూపాయిలు మాత్రమే హీరోకి చేతి చమురు వదుల్తుంది. బయ్యర్లకు ఇండియాకు రెండు కోట్లు ఎటువంటి పన్నులు లేకుండా చేరిపోతాయి. బయ్యర్లు వాటిని సినిమాల కొనుగోలులో జరిగే లావాదేవీలకు హ్యాపీగా వాడుకోవచ్చు.

పైగా ఈ మధ్య ఓవర్ సీస్ బయ్యర్లే ఇక్కడ సినిమాలకు నిర్మాతలుగా మారుతున్నారు. ఇక్కడి సినిమాల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. అందువల్ల హీరోలకు, ఓవర్ సీస్ బయ్యర్లకు మధ్య మనీ లావా దేవీలు మరీ సులువుగా మారుతున్నాయి. ఈ వ్యవహారం ఎంత వరకు ఎన్ని సినిమాలకు జరుగుతోందో తెలియడం లేదు కానీ, ఇండస్ట్రీ లో గుసగుసలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి.