గీత గోవిందం.. యూత్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా. ఈ సినిమా విడుదల ఈనెల 15న. అయితే దానికి పది రోజులు ముందుగానే కొంత సినిమాను జనాలు చూసేయచ్చు. అలా చూసేసి, సినిమాలో ఇంక ఏం మిగిలిందో? ఓ అంచనాకు వచ్చేయచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే, గీత గోవిందం సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. అయితే కొన్నిసీన్లు తొలగించారు.
సినిమాలో ఏముందో? ఏమిలేదో తెలయదు కానీ, సినిమాను అర్జున్ రెడ్డి కి సీక్వెల్ అన్నట్లు ప్రజెంట్ చేస్తూ, ప్రచారం చేస్తున్నారు. స్టిల్స్ కూడా ప్రత్యేకంగా తీయించి మరీ అలాంటివే వదుల్తున్నారు. ఈ నేపథ్యంలో గీతగోవిందంలో సెన్సారు కారణంగా డిలీట్ అయిన సీన్లను ఈనెల 6న యూట్యూబ్ లోకి వదిలేయాలనే అద్భుతమైన అయిడియా మేకర్లకు వచ్చిందని తెలుస్తోంది.
మరి వెరైటీగా వుంటుందని హీరోనే ఈ అయిడియా ఇచ్చినట్లో? లేక మేకర్లకే తట్టినట్లో? ఇది మంచిది కాదని, సినిమా మీద ఇంప్రెషన్ పోతుందని, లేదా నెగిటివ్ ఓపీనియన్ డెవలప్ కావచ్చని, గీతా జనాలు కొందరు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా కూడా ఆరున వదిలేయాల్సిందే డిలీట్ సీన్లు అని డిసైడ్ అయికూర్చున్నారట.
ఏమైతేనేం, తాను పట్టిన కుందేలు కాళ్లు చందంగా డిలీట్ సీన్లు కనుక పదిరోజులు ముందు యూట్యూబ్ లోకి వస్తే తీసేసినవి ఇలావుంటే, ఇంక సినిమాలో ఏం వుంటుంది అనో? సీన్లు ఇలా వున్నాయి అంటే జోనర్ ఏదయి వుంటుందనో? జనాలు డిస్కషన్లు సాగించుకుని, సినిమా మీద హ్యాపీగా ఓ ఓపినీయన్ కు వచ్చి, 15న టికెట్ కొనాలా? వద్దా? అన్నదానికి డిసైడ్ అవుతారు.