పండగ చేసుకుంటోన్న ‘టెంపర్‌’

పెద్ద సినిమాలు రిలీజ్‌ చేయడానికి హాలిడే సీజన్‌ ఎందుకు కావాలంటారో, పండగల టైమ్‌లోనే పెద్ద చిత్రాల్ని రిలీజ్‌ చేయడానికి ఎందుకలా పోటీ పడతారో శివరాత్రి రోజున ‘టెంపర్‌’ కోలాహలం చూస్తే అర్థమవుతుంది. ఆఫ్‌ సీజన్‌లో…

పెద్ద సినిమాలు రిలీజ్‌ చేయడానికి హాలిడే సీజన్‌ ఎందుకు కావాలంటారో, పండగల టైమ్‌లోనే పెద్ద చిత్రాల్ని రిలీజ్‌ చేయడానికి ఎందుకలా పోటీ పడతారో శివరాత్రి రోజున ‘టెంపర్‌’ కోలాహలం చూస్తే అర్థమవుతుంది. ఆఫ్‌ సీజన్‌లో రిలీజ్‌ అయిన ‘టెంపర్‌’కి ఒకే ఒక్క పబ్లిక్‌ హాలిడే కలిసి వచ్చింది. మహాశివరాత్రిని ఈ చిత్రం బ్రహ్మాండంగా క్యాష్‌ చేసుకుంటోంది. 

మంగళవారం కలెక్షన్లు అన్ని ఏరియాల్లో అద్భుతంగా ఉన్నాయి. మార్నింగ్‌ షోస్‌ మామూలుగా ఉన్నా కానీ మ్యాట్నీ నుంచి టాప్‌ గేర్‌కి వెళ్లిపోయింది. చాలా చోట్ల మ్యాట్నీ, ఫస్ట్‌ షో, సెకండ్‌ షో ఆల్రెడీ ఫుల్‌ అయిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మిడ్‌నైట్‌ షోస్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ‘టెంపర్‌’కి మొదటి రోజు తర్వాత కలెక్షన్ల పరంగా ఇదే బెస్ట్‌ డే అవుతుందని ట్రేడ్‌ టాక్‌. 

అయిదో రోజు షేర్‌ అయిదు కోట్ల రేంజిలో ఉంటుందని అంచనా. మూడు రోజుల్లోనే పాతిక కోట్ల షేర్‌ రాబట్టిన ఈ చిత్రం నాలుగో రోజున కూడా రెండున్నర కోట్ల పైనే వసూలు చేసింది. అయిదో రోజు ప్రభంజనంతో ఎన్టీఆర్‌ సినిమాల్లో ఫస్ట్‌ వీక్‌ కలెక్షన్లలో టాప్‌ ప్లేస్‌ని ‘టెంపర్‌’ చేరుకుంటుంది. ఫుల్‌ రన్‌లో ‘బాద్‌షా’ని దాటుతుందా లేదా అనేది బుధవారం నుంచి హోల్డ్‌ చేసే దానిని బట్టి ఉంటుంది.