పాపకి వర్మ టోపీ పెట్టాడుగా!

రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్‌’ చిత్రానికి సీక్వెల్‌ తీసే పనిని సీరియస్‌గానే తీసుకున్నాడు. ఐస్‌క్రీమ్‌ విమర్శల పాలయినా కానీ దానికి సీక్వెల్‌ తీసి దానినొక ఫ్రాంఛైజీ చేయాలని వర్మ చూస్తున్నాడు. ఐస్‌క్రీమ్‌లో నటించిన నవదీప్‌కి సీక్వెల్‌లో కూడా…

రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్‌’ చిత్రానికి సీక్వెల్‌ తీసే పనిని సీరియస్‌గానే తీసుకున్నాడు. ఐస్‌క్రీమ్‌ విమర్శల పాలయినా కానీ దానికి సీక్వెల్‌ తీసి దానినొక ఫ్రాంఛైజీ చేయాలని వర్మ చూస్తున్నాడు. ఐస్‌క్రీమ్‌లో నటించిన నవదీప్‌కి సీక్వెల్‌లో కూడా నటించే అవకాశం దక్కింది. 

కానీ అందులో నటించిన తేజస్వికి మాత్రం ఈసారి ఐస్‌క్రీమ్‌ టేస్ట్‌ చేసే ఛాన్స్‌ ఇవ్వలేదు. తేజస్వికి బదులుగా నవీన అనే కొత్తమ్మాయిని వర్మ తెలుగు తెరకి పరిచయం చేస్తున్నాడు. నవీనకి ఇది తొలి సినిమా అయినా కానీ ఫోటోషూట్‌తోనే కెమెరా ముందు తన అందాలు పరచడానికి ఎంత తహతహగా ఉందో చాటి చెప్తోంది.

హీరోయిన్‌ చెల్లెలిగా, స్నేహితురాలిగా క్యారెక్టర్లు వేసుకుంటోన్న తేజస్విని తీసుకెళ్లి హీరోయిన్‌ని చేసిన వర్మ ఆమెకి బ్రేక్‌ ఇవ్వకుండానే రీప్లేస్‌ చేసి పారేసాడు. పాపం ఇప్పుడు తేజస్వి అటు హీరోయిన్‌గా కాక, ఇటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కంటిన్యూ  కాలేక నడిమధ్యలో చిక్కుకుపోయింది.