పాపం..కిషోర్ తిరుమల

నేను శైలజ సినిమాతో సర్రున లైమ్ లైట్ లోకి దూసుకువచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఆ వెంటనే ఆఫర్లే ఆఫర్లు. కానీ కిషర్ వెళ్లి వెళ్లి విక్టరీ వెంకటేష్ కు సై అన్నాడు. కానీ…

నేను శైలజ సినిమాతో సర్రున లైమ్ లైట్ లోకి దూసుకువచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఆ వెంటనే ఆఫర్లే ఆఫర్లు. కానీ కిషర్ వెళ్లి వెళ్లి విక్టరీ వెంకటేష్ కు సై అన్నాడు. కానీ ఇప్పుడు ఆ సినిమా వ్యవహారం ఎక్కడి వేసిన గొంగళి అక్కడ అన్నట్లు వుంది.

తయారుచేసిన స్క్రిప్ట్ హీరోగారికి పూర్తి సంతృప్తి నివ్వడం లేదు. చేస్తున్న మార్పులు చేర్పులు సరిపోవడం లేదు. మరోపక్క ఈ స్క్రిప్ట్ సంగతి అలా వుంచి, వేరే డైరక్టర్లతో సినిమా అయితే ఎలా వుంటుందా? అని వెంకీ ఆల్టర్ నేటివ్ లు వెదికేస్తున్నారు. 

పాపం, ఇప్పుడు ప్రాజెక్టు స్టార్ట్ కాకపోతే కిషోర్ తిరుమలకు పెద్ద షాక్ నే. పైగా నితిన్ తాను కిషోర్ తిరుమలతో సినిమా చేస్తున్నా అని ప్రకటిస్తే, వెంటనే టక్కున ఖండించేసాడు కూడా. కాస్తయినా సంయమనం పాటించకుండా. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. అందుకే మరీ అలా కర్ర విరిచినట్లు నో చెప్పేయకూడదు.

మొదటి సినిమా స్క్రిప్ట్ పెర్ ఫెక్ట్ గా వచ్చిందీ అంటే అక్కడ స్రవంతి రవికిషోర్ వున్నారు. ఆయనకు కాస్త అభిరుచి వుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఎలా కావాలో వెంకీ అండ్ కో చెబుతారు. కానీ అలా చేయడం అన్నది మాత్రం సోలోగా కిషోర్ బాధ్యతే. అక్కడే వస్తోందేమో? సమస్య.