పాపం కిట్టుగాడు

రాజ్ తరుణ్ టైమ్ ఇంకా సెట్ అయినట్లు లేదు. కిట్టుగాడు సినిమా నవంబర్ నుంచి ఇదిగో అదిగో అంటూ ఫిబ్రవరికి వచ్చింది. అక్కడి నుంచి మళ్లీ మార్చికి వెళ్లిపోతోంది. ఈ నెల 17కు వద్దాం…

రాజ్ తరుణ్ టైమ్ ఇంకా సెట్ అయినట్లు లేదు. కిట్టుగాడు సినిమా నవంబర్ నుంచి ఇదిగో అదిగో అంటూ ఫిబ్రవరికి వచ్చింది. అక్కడి నుంచి మళ్లీ మార్చికి వెళ్లిపోతోంది. ఈ నెల 17కు వద్దాం అనుకుంటే ఇంకా వర్క్ ఫినిష్ కాలేదని వినికిడి. సెన్సారుకు అప్లయ్ చేసారు కానీ, పూర్తిగా పనులు జరిగి, క్యూబ్ అప్ లోడ్ కావడానికి టైమ్ సరిపోదట. దాంతో ఆ డేట్ ను ఘాజీ కి సోలోగా వదిలేస్తున్నారు. 

24న వద్దాం అంటే సాయి ధరమ్ తేజ విన్నర్ వస్తోంది. దానిపై ఈ సినిమా వేయడం అంత శ్రేయస్కరం కాదు. ఇక మిగిలిన డేట్ అంటే మార్చిలోకి వెళ్లిపోవాల్సిందే. అయితే 3న విజయ్ దేవరకొండ ద్వారక వుంది. దానిపైనే వేసేయాలని ఆలోచిస్తున్నారు. రెండూ యూత్ ఫిలిమ్ సినిమాలే అయినా ఇంకా ఆలోచిస్తూ వుంటే సరైన డేట్ దొరక్కుండా పోతుంది.

నిజానికి సినిమాను వీర చెక్కుడు చెక్కకుండా వున్నా, అయిటమ్ సాంగ్ జోడించడం అన్నది ముందుగా అనుకున్నా ఈ పాటికి సినిమా రెడీ అయి వుండేది. కానీ అలా జరగలేదు. సరైన డేట్ దొరక్కుండా పోతోంది.