హీరో నిఖిల్ పరిస్థితి భలే చిత్రంగా వుంది. నిర్మాతకు హీరోకు, నిర్మాతకు దర్శకుడికి మధ్య సరైన కమ్యూనికేషన్ లేక, తన సినిమా ఎక్కడికిపోతావు చిన్నవాడా వ్యవహారం కిందా మీదా అవుతోంది. సినిమా 18న సినిమా విడుదల ఫిక్సయింది. సోలోగా వస్తోంది. పైగా మంచి బజ్ వుంది. పైగా మంచి రేట్లకే సినిమాను అమ్మారు. అన్నీ బాగానే వున్నాయి కానీ, సరైన ప్రచారం లేదు.
అడియో ఫంక్షన్ చేద్దాం అనుకునే సరికి నిర్మాత నుంచి సరైన కోపరేషన్ దొరక్క, నిఖిల్ కొంత మొత్తం ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందని వినికిడి. నిర్మాత రెండు లక్షలు ఖర్చు చేస్తే, నిఖిల్ అయిదు లక్షల వరకు ఖర్చు చేసుకోవాల్సి వచ్చిందట. తీరా ఇంతా చేసినా, చానెళ్ల లైవ్ లేకుండా పోయింది.
ఇదిలా వుంటే ఈ అడియో ఫంక్షన్ లో విడుదల చేద్దామని రెండు ట్రయిలర్లు రెడీ చేసారట. వాటిలో ఒకటి ఫన్ ట్రయిలర్, రెండవది సినిమా జోనర్ తో కూడిన ట్రయిలర్. కానీ రెండూ విడుదల చేయలేదు. దీనికి కారణం, ఫంక్షన్ చేసిన అడియో ఏర్పాట్లు సరిగ్గా పనిచేయలేదని తెలుస్తోంది. అడియో సింక్ కరెక్ట్ గా లేకపోవడంతో గప్ చిప్ గా ట్రయిలర్ల విడుదల ఆపేసారంట.
సినిమా విడుదల ఇంకో మూడు నాలుగు రోజులు వుంది.కానీ ట్రయిలర్ మాత్రం లేదు. బ్యాడ్ లక్ కాక మరేమిటి?