అంతన్నాడు..ఇంతన్నాడే..గంగరాజు…అన్నట్లు అయింది టాలీవుడ్ లోని ఓ డైరక్టర్ పరిస్థితి. చక్కగా రెండు రీజనబుల్ హిట్ లు కొట్టాడు. తరువాత మళ్లీ మరో రీజనబుల్ సినిమా తీసి వుండేవాడేమో..హిట్ కొట్టేవాడేమో..కానీ అక్కడే ఓ గమ్మత్తు జరిగింది.
ఓ పెద్ద డైరక్టర్ పక్కకు లాగారు. పే..ద్ద స్టార్ తో సినిమా సెట్ చేస్తా అన్నారు. దాంతో మనవాడు మహా ఆశపడ్డాడు. సహజం కదా..ఏడాదిన్నర అయిపోతోంది. సినిమా లేదు.
చూస్తుండగానే ఆ పే..ద్ద హీరో వరుసగా సినిమాల మీద సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు మీడియం డైరక్టర్ కళ్ల ముందు రంగుల సినిమా కరిగిపోయింది. బుద్దిగా ఆ డైరక్టర్ కు ఓ నమస్కారం పెట్టి, ఓ ప్రొడక్షన్ హవుస్ దగ్గరకు చేరిపోయాడు. వాళ్లు ఇఫ్పుడు ఓ మెగా హీరోతో సినిమా సెట్ చేసే పనిలో పడ్డారు.
ఆ మెగా హీరో కూడా సరైన లైనప్ లేక, చేస్తున్న సినిమా సరిగ్గా రాక అటు ఇటు చూస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఈ సినిమా ఫిక్స్ కావడం పెద్ద కష్టం కాదు. అంతా బాగానే వుంది కథ సుఖాంతమే.కానీ ఈ మీడియం డైరక్టర్ నే..ఆ పేద్ద డైరక్టర్ అంటే కారాలు..మిరియాలు నూరుతున్నారని బోగట్టా.