Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పరుశురామ్ పుణ్యమా అని…

పరుశురామ్ పుణ్యమా అని…

ఏ దర్శకుడికి అయినా పెద్ద హీరోలతో సినిమా చేయాలని వుంటుంది. చిన్న సినిమా చేతిలో పడిన తరువాతే ప్రూవ్ చేసుకుని పెద్ద హీరోల దగ్గర చాన్స్ కొట్టే దర్శకులే ఎక్కువ. ఏ ఒకరికో ఇద్దరికో నేరుగా పెద్ద సినిమా చేతిలో పడే అవకాశం వుంటుంది. 

చిన్న సినిమా చేసి సక్సెస్ కొట్టి, పెద్ద సినిమా చాన్స్ పట్టి, అక్కడ విజ‌యం సాధిస్తే ఇక ఆ స్పీడ్ వేరుగా వుంటుంది. కానీ అక్కడ కొంచెం తేడా చేసినా కెరీర్ ట్రబుల్ లో పడుతుంది.

దర్శకుడు పరుశురామ్ ఇప్పటి వరకు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. గీతగోవిందం సినిమా కు చాలా టైమ్ తీసుకున్నారు. గీతా సంస్థ, అరవింద్…బన్నీ వాస్ లాంటి వాళ్ల అనుభవం తోడయింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 

సర్కారు వారి పాట స్క్రిప్ట్ సెకండాఫ్ విషయంలో అల్లు అరవింద్ అసంతృప్తితో వుండడం వల్లే ఆ ప్రాజెక్టు బయటకు వెళ్లిందని అప్పట్లో టాక్ వినిపించింది. సరే ఆ సంగతులు అన్నీ ఎలా వున్నా మహేష్ బాబుతో సినిమా విషయంలో పరుశురామ్ కొంత తడబడ్డారన్నది వాస్తవం.

పెద్ద సినిమాలకు కావాల్సిన హై లు… ఎలివేషన్లు సెట్ చేయడం పరుశురామ్ కు కుదరలేదన్నది ఇంకా వాస్తవం. దీంతో ఇప్పుడు ప్లానింగ్ లో వున్న మరో రెండు సినిమాలకు గండం ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్, ప్రభాస్ లాంటి హీరోలు కొందరు మిడ్ రేంజ్ డైరక్టర్లతో సినిమాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు వారంతా ఆలోచనలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

మిడ్ రేంజ్ హీరోలు పెద్ద హీరోల సినిమాలకు సరిపడా సీన్లు అల్లలేకపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే పరుశురామ్ సినిమా వల్ల మిగిలిన హీరోల ప్రాజెక్ట్ లు ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?