అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు. శుక్రవారం రిలీజ్ వదిలి బుధవారం ఎంచుకుని బోల్తాపడ్డారు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ విషయంలో. ఈ రోజుల్లో సినిమా మిడిల్ ఆఫ్ ది వీక్ విడుదలయితే, శుక్రవారం నాటికి టాక్ స్ప్రెడ్ అయిపోయి, వీకెండ్ లోనే సినిమా చతికిల పడిపోతోంది.
అయితే ఓవర్ సీస్ లో ఆఫర్లు వున్నాయని, కలెక్షన్లు కుమ్మేస్తాయని బుధవారం విడుదలకు వెళ్లారు. కానీ ఫలితం తేడాకొట్టేసింది. వీకెండ్ వచ్చేలోగానే టాక్ పాకేసింది. జనాన్ని థియేటర్ కు దూరం చేసింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 విషయంలో ఈ పొరపాటు చేయదలుచుకోలేదు. కచ్చితంగా శుక్రవారమే విడుదల చేయాలని యూనిట్ డిసైడ్ అయినట్లు బోగట్టా.
నూటికి తొంభైశాతం ఈనెల 22నే బయోపిక్ విడుదల కావడానికి చాన్స్ వుంది. ప్రస్తుతానికి బయ్యర్లు ఎవరికీ ఏ విషయం చెప్పడంలేదు కానీ, 22 టార్గెట్ గా పెట్టుకునే సినిమాను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు కొన్ని అదనపు ఎమోషన్లు జోడించడంలో దర్శకుడు క్రిష్ బిజీగా వున్నారు. ఈ వర్క్ ఇంకో నాలుగయిదు రోజులకన్నా ఎక్కువే వుంటుందని తెలుస్తోంది.