మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెన్సార్ కు లోడ్ అయిపోయిందని వినికిడి. ఓ పక్క ఎక్కడి ఫినిషింగ్ పనులు అక్కడ పెండింగ్ లో వుండగానే, టాకీపార్ట్ ను ఓ మేరకు ఎడిట్ చేసేసి, సెన్సార్ కు లోడ్ చేసేసారని వినికిడి. మరి సెన్సారు ఎప్పుడు చేస్తారన్నది ఇంకా తెలియాలి. తరువాత మిగిలి పోయిన పాటలు సెన్సారు చేయించుకోవచ్చని ఆలోచగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఇంకా డీటీఎస్ మిక్సింగ్, ఇంకా చాలా చాలా చిన్న చిన్న పనులు పెండింగ్ లోనే వున్నాయట.
దర్శకుడు బాబీ చెన్నయ్ లోనూ, హైదరాబాద్ లోనూ ఈ పనులు చూస్తున్నారు.. పవన్ విదేశాలకు వెళ్లి పాటలు తీసుకు వస్తారు. ఇదిలా వుంటే సినిమా ఎడిటింగ్ ఎక్కువగా పవన్ సంస్థ లోని క్రియేటివ్ హెడ్ హరీష్ పాయ్ నే చేసేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ 8న విడుదల కావాలన్నది సంకల్పం. సరిగ్గా పది రోజులు వుంది టైమ్. చివరి మూడు రోజులు తీసేయాల్సిందే. క్యూబ్ లు లోడ్ చేయడం, ఓవర్ సీస్ డిస్క్ లు రెడీ చేయడం, పవన్ 31న వస్తారని తెలుస్తోంది..అంటే అక్కడికి అయిదు రోజులు టైమ్ వుంటుంది. మొత్తానికి సర్దార్ గుర్రంపై దౌడు తీసినట్లు సినిమా ఫినిష్ చేయడానికి పరుగులు పెట్టాల్సిందే.