Advertisement


Home > Movies - Movie Gossip
పాట పాడనున్న బాలయ్య

బాలయ్య లేటెస్ట్ మూవీ పైసా వసూల్ ఫంక్షన్ డేట్ దగ్గరకు వస్తోంది. ఈ ఫంక్షన్ స్పెషల్ అట్రాక్షన్లలో ఒకటి ఆయన లైవ్ పెర్ ఫార్మెన్స్ అనే తెలుస్తోంది. గతంలో అమెరికా వేదికలపై బాలయ్య పాటలు పాడారు. స్టేజ్ పై పాటలు పాడడం అంటే బాలయ్యకు ఇష్టం. అందుకే ఇప్పుడు ఈ అడియో ఫంక్షన్ లో కూడా బాలయ్య పాట పాడే అంశం ఒకటి చేర్చారట. 

పైసా వసూల్ సినిమాలో బాలయ్య ఓ పాటను స్వయంగా పాడిన సంగతి తెలిసిందే. ఏక్ పెగ్ లావో అనే పల్లవితో పాట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పాటనే స్టేజ్ మీద లైవ్ ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట బాలయ్య. అసలే బాలయ్య హావభావాలు అభిమానులకు కిక్కు ఇస్తాయి. దానికి తోడు పెగ్ లావో అంటూ కిక్కిచ్చే పాట పాడితే మరింత కిక్కే కిక్కు.

తొలిసారి ఖమ్మంలో భారీ సినిమా ఫంక్షన్ జరుగుతోంది. ఈ ఫంక్షన్ కు బాలయ్య సన్నిహితులు, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, దర్శకులు పలువురు హాజరవుతారు.