ఒకే ఒక్క ఫ్లాప్‌తో డైరెక్టర్ హరీష్ శంకర్ కెరీర్ రివర్స్ అయింది. రామయ్యా వస్తావయ్యా తర్వాత అతనికి మళ్లీ మరో అవకాశం రాలేదు. చాలా మంది హీరోల చుట్టూ తిరిగినా అంతా బిజీగా ఉండడంతో హరీష్ ఖాళీగా ఉన్నాడు. అయితే ఆమధ్య పవన్‌కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి.
గబ్బర్‌సింగ్ 2 చిత్రాన్ని హరీష్ డైరెక్షన్‌లోనే పవన్ చేస్తాడని ప్రచారం జరిగింది. హరీష్ శంకర్ మాత్రం ఇదంతా తనకి తెలీనట్టే సైలెంట్‌గా ఉన్నాడు. మామూలుగా దేనికైనా ఇమ్మీడియట్‌గా క్లారిఫికేషన్ ఇచ్చే హరీష్ సైలెంట్‌గా ఉండడంతో నిజంగానే ఈ చిత్రం ఉంటుందేమో అనుకున్నారు. కానీ హరీష్ వేరే ప్లాన్స్‌లో ఉన్నాడు.
మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్‌తో హరీష్ సినిమా ఖరారైంది. సుబ్రమణ్యం ఫర్ సేల్ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు హరీష్. దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తారని సమాచారం. తొలి సినిమా రేయ్ విడుదల కాక డీలా పడ్డ సాయి ధరమ్ తేజ్‌కి కాన్ఫిడెన్స్ పెంచే ప్రాజెక్ట్ సెట్టయ్యింది.