గోపాల గోపాల మార్కెట్ పరంగానూ సరికొత్త క్రేజ్‌ని సొంతం చేసుకొంది. ఇద్దరుటాప్ స్టార్లు, అందులోనా అత్తారింటికి దారేది తరవాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా, దానికి తోడు బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ఓ మైగాడ్‌కి రీమేక్.
అందుకే ఈసినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. గోపాల గోపాల హక్కుల కోసం పంపిణీదారులు పోటీ పడుతున్నారు. నైజం రైట్స్ మాత్రం నైజాం రాజు దిల్‌రాజుకి సొంతమైంది. నైజాం రైట్స్‌ని రూ 13.5 కోట్లకు ఆయన సొంతం చేసుకొన్నాడు.
నైజాంలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ సినిమాలు భారీ వసూళ్లనుసాధించాయి. పవన్ సినిమా హిట్టయితే నైజాంలో వసూళ్ల పండగే. అందుకే ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడానికి ధైర్యం చేశాడు దిల్‌రాజు.