పవన్ సినిమా ఓవర్ సీస్? ఏం జరుగుతోంది?

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో సినిమా ఓవర్ సీస్ హక్కులు అమ్ముడైపోయాయని, నాన్ బాహుబలి రికార్డు అని తొందర పడి కోయిల ముందే కూసినట్లు వార్తలు వచ్చేసాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ…

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో సినిమా ఓవర్ సీస్ హక్కులు అమ్ముడైపోయాయని, నాన్ బాహుబలి రికార్డు అని తొందర పడి కోయిల ముందే కూసినట్లు వార్తలు వచ్చేసాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ వార్త పూర్తిగా నిజం కాదన్నది.

ఓవర్ సీస్ రేటు మీద హారిక హాసిని సంస్థ మొదట్నించీ ఒకటే ఫిగర్ మీద స్టబర్న్ గా వుంది. 21కోట్లకు ఓవర్ సీస్ హక్కులు ఇస్తామని చెబుతూ వస్తోంది. అయితే ఓవర్ సీస్ హక్కుల కోసం బ్లూ స్కై సంస్థ 19కోట్ల కోట్ చేసింది. కానీ హారిక హాసిని 21 తగ్గేది లేదని క్లియర్ చేసేసింది. దీంతో బ్లూ స్కై 20కోట్లకు వచ్చింది. హారిక హాసిని తన ఫిగర్ మీదే వుంది. 

దీంతో 20కోట్లు అవుట్ రేట్, ఒక కోటి రూపాయిలు రికవరబుల్ అమౌంట్ గా ఇచ్చేందుకు బ్లూ స్కై ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వినాయకచవితి అడ్డం పడింది. చవితి వెళ్లిన తరువాత డిస్కషన్లు కంటిన్యూ చేసి, అగ్రిమెంట్ చేసుకోవాలని ఇరు పక్షాలు డిసైడ్ అయ్యాయి.

అది కూడా ఈ టర్మ్ కు హారిక హాసిని ఓకె అనాలి లేదా, వాళ్ల మాటకు బ్లూ స్కై ఓకె అంటేనే? దాదాపు అగ్రిమెంట్ కదురేలాగే వుంది. ఎటొచ్చీ ముహుర్తాల ఇంట్రెస్ట్ ఎక్కువగా వున్న త్రివిక్రమ్, చిన్నబాబు అండ్ కో వ్యవహారం కాబట్టి, అందుకోసం వెయిటింగ్ అనుకోవాలి.