సంపత్ నంది నిర్మాతగా మారాడు. మొదటి సినిమా వదిలేస్తే, రెండో సినిమాకే కాస్త పైసలు ఇచ్చి వుంటారన్నది వాస్తవం. ఎంత అమెరికా కంపెనీ ఫైనాన్సు చేసినా, కాస్తయినా పెట్టుబడి కావాలి కదా? దాని వెనుక గమ్మత్తయిన వదంతి వినిపిస్తోంది. పవన్ తన కారణంగా సంపత్ నంది అలా రెండేళ్ల పాటు వుండిపోయాడన్న దృష్టితో, కొంత సాయం చేసాడని తెలుస్తోంది.
కాదు, గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కనుక, అనుకున్న మొత్తం ముందే ఇచ్చేసాడని మరో రూమర్. ఏది నిజమో తెలియదు కానీ, గాలిపటం సినిమాకు వేరే పేరు దర్శకుడిగా వున్నా, సంపత్ నందే అన్నీ నిర్వహించాడని మాత్రం రూఢిగా వినిపిస్తోంది. పోనీ ఈ సినిమాతో అయినా సంపత్ నంది, కాస్త సంపద చేసుకుంటే మంచిదే.