పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’ జనవరిలో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా మొత్తం పూర్తయ్యేలా పకడ్బందీ ప్రణాళిక వేసుకున్నారు. దీని తర్వాత పవన్ చేసే చిత్రం ఏ బ్యానర్‌లో ఉంటుందనేది ముందే ఫిక్స్ అయింది. పవన్‌కి పద్ధెనిమిది కోట్ల పారితోషికం చెల్లించిన పి.వి.పి. సినిమా బ్యానర్‌లోనే అతని మలి చిత్రం ఉంటుంది.
కానీ ఇంతవరకు దీనికి దర్శకుడు ఎవరనేది తేలలేదు. కనీసం పవన్ క్రియేటివ్ టీమ్ కూడా దీనికోసం కథ ఏమీ రెడీ చేయడం లేదు. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని పవన్ అనుకుంటున్నాడట. అలాంటి కథ కోసం ఎదురు చూస్తున్నాడట.
ఇద్దరు, ముగ్గురు దర్శకులు పవన్‌కళ్యాణ్‌ని కలిసి కథలు వినిపించారు కానీ పవర్‌స్టార్ హండ్రెడ్ పర్సెంట్ శాటిస్‌ఫై కాలేదని తెలిసింది. భారీ బడ్జెట్ చిత్రం కనుక ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా నీట్ ఎంటర్‌టైనర్ చేస్తే మంచిదనేది పవన్ ఆలోచన. ఈ చిత్రానికి కథ, దర్శకుడు అన్నీ ఖరారు చేసేది పవన్‌కళ్యాణే. నిర్మాతలది కేవలం పెట్టుబడి మాత్రమే!